Skip to main content

బందరు పోర్టును మేమే పూర్తి చేస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర


మచిలీపట్నం :

- పెట్టుబడులను తరిమేసి, పరిశ్రమలను బెదిరించిన నీచ సంస్కృతి వైసిపిది

- బందరు పోర్టు పూర్తి చేయకుంటే ముక్కు నెలకు రాస్తా, రాజకీయ సన్యాసం తీసుకుంటానని పేర్ని నాని ప్రజల్ని దగా చేశాడు

- ఐదేళ్లు అధికారంలో ఉండి ఒక్క పోర్టు గానీ హార్బర్ గానీ పూర్తి చేయలేదు

- ఏడాది చివరి నాటికి బందర్ పోర్టును పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇస్తాం

- రాజకీయ లబ్ది కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే క్షమించబోమని మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్.

మచిలీపట్నం :

బందరు పోర్టు, ఫిషింగ్ హార్బర్ పనులను మేమే పూర్తి చేస్తాం.. ప్రారంభోత్సవం కూడా చేస్తామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈ మేరకు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు , డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ తో కలిసి మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు.

వైసీపీ దండుపాళ్యం బ్యాచ్ బందరు వచ్చి కారు కూతలు కూస్తోంది. బందరుకి రాష్ట్రానికి ఏదో చేశాం, ఉద్ధరించాం అన్నట్లుగా మాట్లాడటం చూస్తే ఆశ్చర్యం కలిగింది. అక్కడకు వచ్చింది ఎవరా అని చూస్తే... ప్రపంచ వ్యాప్తంగా హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిని కల్తీ చేసి జేబులు నింపుకున్న వ్యక్తి ఒకరు. రాష్ట్రంలో పరిశ్రమల గురించిబడిగితే.. కోడి గుడ్డు పెట్టింది పొదగాలి, పిల్ల రావాలి అన్న వ్యక్తి ఒకరు. ఈవీఎంలు పగలగొట్టి, ఐదేళ్ల పాలనలో హత్యలు అరాచకాలతో పెట్రేగిన వ్యక్తి మరొకరు. మరో మహానుభావుడు పేదల బియ్యం బొక్కి పెనాల్టీ కట్టేసాను, నేను నీతిమంతుడిని అని చెప్పుకున్నాడు. వీళ్ళంతా కలిసి బందరు ఉద్ధరించేశాం అన్నట్లు మాట్లాడుతున్నారు.

కియా సంస్థను కమిషన్ల కోసం బెదిరించిన నీచ సంస్కృతి వైసిపి నేతలది. లులు సంస్థను ఎలా తరిమేశారో ఆ సంస్థ చైర్మన్ యూసుఫ్ ఆలీ సోషల్ మీడియా వేదికగా బయటపెట్టారు. అమర్ రాజా కంపెనీ పై ఎలాంటి నిందలేసి సుమారు 9000 కోట్ల పెట్టుబడిని తెలంగాణకు తరిమేసిన దుర్మార్గులు ఈ వైసిపి నేతలు. బందరు పోర్టు బందరులో వద్దు గోగిలేరుకు తరలించండి అని సాక్షాత్తు లేఖలు రాసిన ఘనుడు పేర్ని నాని. 2008లో బందరు పోర్టు కోసం మేమంతా ఉద్యమాలు చేస్తుంటే మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులు అంటూ అవమానించిన దుర్మార్గుడు ఈ పేర్ని నాని. బందరు పోర్టు సాధించకుంటే ముక్కు నెలకు రాస్తా, రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటూ ప్రగల్భాలు పలికి ఆరోజు అధికారంలోకి వచ్చారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నారు. 2023 వరకు కనీసం పోర్టును గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడో శంకుస్థాపన చేసిన బందరుపోర్టుకి 2023లో మళ్లీ శంకుస్థాపన చేయడం తప్ప సాధించింది ఏమీ లేదు.

2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు టిడిపి ప్రభుత్వం రైతులకు పరిహారం అందించి, ప్రజలను ఒప్పించి పోర్టుకు శంకుస్థాపన చేసింది. మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన పేర్ని నాని, జగన్ రెడ్డి 2023 వరకు పోర్టును కనీసం పట్టించుకోలేదు. నాటి ఎంపీ బాలశౌరి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.4000 కోట్లు తీసుకొచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే  పనులు పనులు పెట్టించి 40శాతం  పోర్టు పనులు పూర్తి చేసాం. బెర్తులు పూర్తి చేశాం, డ్రెడ్జింగ్  ఎస్టిమేషన్స్ పెంచాలని నిర్మాణ సంస్థ త్వరగా ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఎన్ని అడ్డంకులు ఏదైనా ఈ ఏడాది డిసెంబర్ నాటికి బందరు పోర్టు పూర్తి చేసి చూపిస్తాం.

ప్రజల విశ్వాసాలు,  భావోద్వేగాలతో రాజకీయం చేస్తామంటే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. ఫిషింగ్ హార్బర్ గురించి మాట్లాడే వైసీపీ నేతలు మూడు సార్లు  ఎందుకు పోస్ట్ పోన్ చేశారో సమాధానం చెప్పాలి. పనుల పేరుతో కమిషన్లు దండుకోవడం తప్ప హార్బర్ కు చేసిందేమీ లేదు. కమిషన్ల కోసం అడ్డగోలుగా డిజైన్లు తయారు చేయించారు. డిజైన్ సరిగా లేవని ఐఐటి మద్రాస్ సూచించడంతో కొత్త డిజైన్ల మేరకు పనులు చేస్తున్నాం. ఎంతో అభివృద్ధి చేశామని చెప్తున్నా వైసిపి నేతలు జువ్వలదిన్నె, ఉప్పాడ, నిజాంపట్నం హార్బర్లు ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం చెప్పాలి.

మచిలీపట్నం మెడికల్ కాలేజీ వైసిపి నేతలకు కనీసం మాట్లాడే అర్హత కూడా లేదు. కేంద్రం నుండి వచ్చిన నిధులు తప్ప రాష్ట్రం నుండి రూపాయి ఖర్చు చేయలేదు. అర్ధాంతరంగా ఆగిపోయిన పనుల్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తి చేసింది. పిపిపి పద్ధతిలో మెడికల్ కాలేజీ లను అభివృద్ధి చేస్తుంటే దానికి కూడా రాజకీయం అద్దుతున్నారు. మచిలీపట్నం పోర్టుకు నిధులు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి వచ్చినవే తప్ప జగన్ రెడ్డి రూపాయి కూడా రాష్ట్ర బడ్జెట్లో కేటాయించలేదు.

యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ సమస్య ఉంటే ఏపీలో మాత్రమే ఉంది అనేలా జగన్ రెడ్డి అండ్ కో వ్యవహరిస్తోంది. ప్రజా సమస్యలపై అడ్డదిడ్డంగా మాట్లాడే వైసీపీ నేతలు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో సమాధానం చెప్పాలి. రాజకీయ అరాచకం కోసం తప్ప అభివృద్ధి ప్రజల సంక్షేమం జగన్ రెడ్డికి ఏమాత్రం పట్టదని ఇప్పటికే ప్రజలందరికీ అర్థమైంది.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకు పోర్టు, ప్రతి జిల్లాలో పరిశ్రమలు, పెట్టుబడులు ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. తప్పుడు ప్రచారాలు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.

ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ.. వైసీపీ నేతలు బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారు. ఐదేళ్ల అధికారంలో ఉండి రాష్ట్రానికి ఏం ఉద్ధరించారు. పోర్టులు హార్బర్లు మేమే చేశామని చెప్పుకునే వైసిపి నేతలు గత ఐదేళ్లలో ఎంత ఖర్చు పెట్టారో ఎంత శాతం పనులు పూర్తి చేశారో సమాధానం చెప్పాలి. కూటమి అధికారంలోకి వచ్చాక బందర్ పోర్టును 60 శాతం పూర్తి చేశాం. జగన్ రెడ్డి అరాచకంతో రాష్ట్రం నుండి తరలిపోయిన పరిశ్రమలను ఒప్పించి భరోసా ఇచ్చి మళ్లీ ఏపీలో పెట్టుబడి పెట్టేలా చేసాం. అవినీతి అరాచకంతో దగాపడ్డ రాష్ట్రాన్ని గత రెండేళ్ల కష్టంతో అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాం. రాష్ట్రాన్ని మీరు ఎంత దారుణంగా నాశనం చేశారో చెప్పడానికి నీకు వచ్చిన 11 సీట్లే నిదర్శనం. మచిలీపట్నంలో మీరు చేసిన అకృత్యాలకు 50,000 ఓట్ల తేడాతో ఓడిపోవడం సాక్షాత్కారం. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత వేధిస్తున్న సమయంలో కోర్టును పరిశీలిస్తామని చెప్పి అక్కడ పనులు ఏమి జరగట్లేదని చూపించేందుకు సిగ్గుమాలిన రాజకీయం చేస్తున్నారు. వైసీపీ నేతలు ఎంత హడావిడి చేసిన మళ్లీ అధికారం అనేది కల అని గుర్తుంచుకోవాలి.

డిసిఎంఎస్ చైర్మన్  బండి రామకృష్ణ మాట్లాడుతూ... వైసిపి నాయకులకు సమస్యలు సృష్టించడం తప్ప ప్రజలకు మేలు చేయడం చేతకాదు. 2019 ముందు పేర్ని నాని ఎన్నో హామీలు ఇచ్చాడు. బందర్ పోర్టుని పూర్తి చేయకపోతే ముక్కు నేలకు రాస్తా రాజకీయ సన్యాసం చేస్తా అంటూ సవాల్ చేశాడు. ఐదేళ్లు అధికారంలో ఉండి కూడా బందరు పోర్టు పూర్తి చేయలేదు.
బందరు పోర్టు గురించి మాట్లాడేందుకు మొహం చెల్లక రాష్ట్రంలో రౌడీ బ్యాచ్ మొత్తాన్ని వెంటేసుకుని వచ్చాడు. వైసిపి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో భారీ బంగ్లా లాంటి పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు. జగన్ రెడ్డి అయితే రుషికొండకి గుండు కొట్టి మరీ ప్యాలెస్ కట్టుకున్నాడు. కానీ ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని మాత్రం చేయలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ప్రతి హామీని పక్కాగా అమలు చేస్తున్నాం. సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేశాం. వైసీపీ నేతలు ఎన్ని రకాలైన డ్రామాలాడిన 2029 తర్వాత దుకాణం సద్దుకోవడం మంచిది. వైసీపీ అనే అరాచక పార్టీకి రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్తు సమాధి అయిపోయిందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ , టౌన్ పార్టీ అధ్యక్షుడు లోగిశెట్టి స్వామి , మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ , సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్ , ఏంటి పిప్పళ్ల వెంకన్న , ఇలియాస్ భాషా తదితర నాయకులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...