మచిలీపట్నం, డిసెంబర్ 2:
ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత.
రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ రికార్డుగా నమోదు చేసింది.
ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు.
డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా పరిశీలించి ఈ రికార్డును అందజేస్తున్నాము. భవిష్యత్తులో దేవస్థానం మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నాంది పలకాలనుకుంటున్నాము” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రిపాటి గోపీచంద్, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, కార్పొరేటర్ చిత్త జల్లు నాగరాము, సబ్ జైలు సూపరింటెండెంట్ పిల్లా రమేష్, బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పీవీ ఫణికుమార్, కన్యకా పరమేశ్వరి దేవాలయం చైర్మన్ మామిడి మురళీ కృష్ణ, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ దిలీప్, ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, గుడివాడ క్రైమ్ సీఐ ఇంజరపు రమణీ, ముదిగొండ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment