మచిలీపట్నం : కృష్ణాజిల్లాలో ఇంధన కొరత, మచిలీపట్నం పోర్టు నిర్మాణం వంటి కీలక అంశాలపై వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వై వి సుబ్బారెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో సత్యా కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సంకల్ప సాధన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో డీజిల్–పెట్రోల్ కొరతపై ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఇంధన కొరత తీవ్రంగా ఉందని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీజిల్ కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా ఆక్వా రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద వైసీపీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వం స్పందించేలా ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యమని చెప్పారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంపై మాట్లాడుతూ, రాష్ట్రంలో నాలుగు పోర్టుల పనులు సుమారు 40 శాతం పూర్తయ్యాయని, ఆరు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం కూడా చివరి దశలో ఉందన్నారు. అయితే ప్రస్తుత ...