Skip to main content

శైవ క్షేత్రంలో టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్

మచిలీపట్నం :

దక్షిణ కాశీగా,ప్రముఖ శైవక్షేత్రంగా పిలువబడుతున్న వేములవాడ శ్రీపార్వతీరాజరాజేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకున్నారు హీరోయిన్ పూనమ్ కౌర్.ఒకప్పటి స్టార్ హీరోయిన్ చాలా సింపుల్‌గా టెంపుల్‌కి రావడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. కొందరు గుర్తు పట్టలేకపోయారు.

 వేములవాడ శ్రీపార్వతీరాజరాజేశ్వరస్వామివారి ఆలయానికి ఈమధ్య కాలంలో సెలబ్రిటీల తాకిడి పెరిగింది. గతంలో రాజకీయ ప్రముఖులు మాత్రమే దర్శించుకున్న ఈ విశిష్ట ఆలయానికి ఇప్పుడు సినీ సెలబ్రిటీలు సైతం దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌గా ఆ తర్వాత దక్షిణా భాషల్లో పలు సినిమాల్లో యాక్ట్ చేసిన హీరోయిన్ పూనమ్ కౌర్ వేములవాడలోని శ్రీపార్వతీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం అక్షయ తృతీయ సందర్భంగా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఒకప్పటి నటి. స్వామివారి కరుణ కటాక్షాలు టెక్స్‌టైల్ రంగంతోపాటు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు వెల్లడించారు.
భీమన్న సన్నిధికి టాలీవుడ్ తార..

ఈమధ్య కాలంలో సినీ సెలబ్రిటీలు పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి వారి మొక్కులు తీర్చుకుంటున్నారు. తాజాగా శ్రీ భీమేశ్వర స్వామివారిని టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌గా పూనమ్ కౌర్ దర్శించుకున్నారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయం అభివృద్ధి పనులు పూర్తికాగానే మళ్లీ స్వామివారి ఆశీస్సుల కోసం వస్తానన్నారు. శక్తి,ప్రపంచ శాంతి కోసం భారతదేశ మరింత శక్తివంతంగా ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు హీరోయిన్ పూనమ్ కౌర్. సోమవారం స్వామివారికి ఇష్టమైన రోజు కావడంతో భీమేశ్వరస్వామివారి సన్నిధిలో శ్రీరాజరాజేశ్వర స్వామివారి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. హీరోయిన్ పూనమ్ కౌర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి దర్శనం తర్వాత అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...