Skip to main content

పరిసరాల శుభ్రత పాటిస్తూ ఆరోగ్యం సంరక్షించుకోవాలి... ఇంచార్జ్ కలెక్టర్ నవీన్

మచిలీపట్నం :

నగర ప్రజలు స్వచ్ఛ సైనికులుగా తయారై పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యం కాపాడుకోవాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎం నవీన్ పిలుపునిచ్చారు.

బుధవారం ఉదయం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ నగరంలోని 44 వ డివిజన్ గాది రెడ్డి గారి వీధి లో డాక్టర్ మల్లికార్జున రావు ఆసుపత్రి సమీపంలో జరిగిన స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ స్వయంగా పట్టకారు లాంటి స్వచ్ఛ ఆయుధాన్ని చేత పట్టుకొని మునిసిపల్ కమిషనర్, సహాయ కమిషనర్, స్వచ్ఛ సైనికులు, పారిశుద్ధ కార్మికులతో కలిసి అక్కడ ఉన్న చెత్తాచెదారాలను తొలగించి శుభ్రం చేశారు 

అనంతరం ఆ ప్రాంతానికి జెసిబి ని రప్పించి మట్టిని తొలగించి మరల చెత్త వేయకుండా అక్కడ మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు సూచించారు.

తదనంతరం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్ఫూర్తితో నగరంలో బ్లాక్ స్పాట్లను గుర్తించి పరిశుభ్రం చేసే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. 

రహదారుల ప్రక్కన చెత్తాచెదారాలు నెలలు తరబడి పేరుకుపోయి ఉన్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించామన్నారు. వాటిని పరిశుభ్రం చేసి మళ్లీ చెత్త అక్కడ వేయకుండా గ్రీన్ స్పాట్లుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. 

స్థానికంగా ఉన్న మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ తరఫున స్వచ్ఛ సైనికులు ముందుకు వచ్చి తమతో పాటు స్వచ్ఛ సర్వేక్షన్ లో పాల్గొనడం అభినందనీయమన్నారు.
ప్రజలలో తప్పకుండా మార్పు రావాలని కాలువల్లో ఎవరూ కూడా చెత్త వేయరాదన్నారు.

నగరంలో ప్రజలు చాలాచోట్ల చెత్తాచెదారాలు ఎక్కడపడితే అక్కడ ముఖ్యంగా రహదారులు పక్కన, కూడళ్ల వద్ద, కాలువల్లో వేయడం జరుగుతుందన్నారు. 

ఆ విధంగా చేయడం వలన పర్యావరణానికి ముప్పు వాటిల్లడమే కాకుండా ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారనీ హెచ్చరించారు.

పరిసరాలు కలుషితం కాకుండా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు.
ప్రజలలో తప్పకుండా మార్పు రావాలన్నారు చెత్తను కాలువల్లో గాని రహదారుల పక్కలో గాని వేయరాదన్నారు

ఇకపై అలా చేయకుండా ప్రజలు బాధ్యత వహించి వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వేయకుండా వారి ఇంటిలోని చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసి ఉంచుకోవాలని మునిసిపల్ స్వచ్ఛ రథం వారి వద్దకు వచ్చినప్పుడు ఆ చెత్తను పారిశుధ్య కార్మికులకు అందజేయాలన్నారు.
పర్యావరణం ఆహ్లాదకరంగా ఉంటే పిల్లలకు, పెద్దలకు ఆరోగ్యం బాగుంటుందన్నారు.

అపార్ట్మెంట్లు వద్ద కూడా చెత్త కనిపిస్తోందని అపార్ట్మెంట్లోని ప్రజలు అంతర్గతంగా సమావేశమై చెత్త నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలన్నారు.
పరిశుభ్రం చేసిన ప్రదేశాలలో మరల ఎవరైనా చెత్త వేసిన ఎడల బాధ్యులైన వారిపై తీవ్రంగా శిక్షలు విధించబడతాయని కలెక్టర్ స్పష్టం చేశారు 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, సహాయ కమిషనర్ గోపాలరావు, సచివాలయ కార్యదర్శి నలిని, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కిషోర్ బాబు ప్రతినిధులు రాంబాబు, ముదిగొండ శాస్త్రి తదితరులు పలువురు మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...