మచిలీపట్నం :
మచిలీపట్నం కోపరేటివ్ అర్బన్ బ్యాంక్లో 28 సంవత్సరాలు సేవలందించిన ఏలిశెట్టి రాజకుమార్ పదవీ విరమణ వీడ్కోలు సభ ఘనంగా నిర్వహించారు. బ్యాంక్ అద్యక్షులు ఇమడా బత్తుల దిలీప్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలువురు అధికారులు రాజకీయ నాయకులు పాల్గొని రాజకుమార్ సేవలను కొనియాడారు.
పదవికే వన్నె తెచ్చే విధంగా అర్బన్ బ్యాంక్ సీఈఓ గా అర్బన్ బ్యాంకులో ఎందరో పేదలకు సహాయ సహకారాలు అందించి బ్యాంకుకి గుర్తింపు తీసుకొచ్చిన రాజ్ కుమార్ సేవలు బ్యాంక్ చరిత్రలో నిలిచిపోతాయని వక్తలు అన్నారు. రాజకీయ పార్టీలు మారిన కార్యవర్గం మారిన తనదైన శైలి లో రాజకుమార్ బ్యాంక్ కార్యకలాపాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విధి నిర్వహణ చేశారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మచిలీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచె నాని, అర్బన్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు బొర్రా విఠల్, మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు బాలాజీ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పంతం వెంకట గజేంద్ర రావు , కే డి సి సి బ్యాంక్ మాజీ డైరెక్టర్ అంబటి కాంతారావు జిల్లాస్థాయి సొసైటీ అధికారులు, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్లు పాల్గొన్నారు. తొలుత రాజకుమార్ పద్మావతి దంపతులు కేక్ కట్ చేశారు. రాజ్ కుమార్ ను పలువు రు శాలువాలతో పూలమాలతో ఘనంగా సన్మానించారు
Comments
Post a Comment