Skip to main content

జెడ్పీ చైర్ పర్సన్ అధ్యక్షతన కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహణ

గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలి

తాగునీటి సమస్యలు, ప్రోటోకాల్ ఉల్లంఘన, అధికారుల గైర్హాజరీ, నిలిచిపోయిన నిధులు తదితర అంశాలపై చర్చ

మచిలీపట్నం: 

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక అధికారులను ఆదేశించారు.
స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో గురువారం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ అధ్యక్షతన ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ కుమార్, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఉమ్మడి కృష్ణా జిల్లా అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో సభ్యులు ప్రధానంగా తాగునీటి సమస్యలు, ప్రోటోకాల్, అధికారుల గైర్హాజరీ, నిలిచిపోయిన నిధులు తదితర అంశాలపై చర్చించారు.

ముఖ్యమైన సమావేశానికి ఉన్నతాధికారుల గైర్హాజరీపై అసహనం
రాజ్యాంగబద్ధంగా నిర్వహించే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ప్రజాప్రతినిధులు తమ ప్రాంత సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లే వేదిక అని పేర్కొన్న చైర్‌పర్సన్, ఇటువంటి ముఖ్యమైన సమావేశానికి ఎన్టీఆర్ జిల్లా ముఖ్య అధికారులు గైర్హాజరు కావడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని జడ్పీ సీఈఓను ఆదేశించారు.
స్టాంప్ డ్యూటీ నిధుల నిలుపుదలతో అభివృద్ధి పనులు కుంటుపాటు
జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు రావాల్సిన సుమారు రూ.23 కోట్ల స్టాంప్ డ్యూటీ నిధులను విడుదల చేయకపోవడం వల్ల గ్రామీణాభివృద్ధి పనులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని చైర్‌పర్సన్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మంజూరైన రూ.20 కోట్ల అభివృద్ధి పనుల్లో, నిధుల కొరతతో రూ.14 కోట్ల పనులను నిలిచిపోయాయన్నారు. తక్షణమే పెండింగ్ నిధులను విడుదల చేసి స్థానిక సంస్థలకు న్యాయం చేయాలని కోరారు.

ప్రోటోకాల్ ఉల్లంఘనలపై ఆగ్రహం
జిల్లా పరిషత్ నిధులతో పూర్తయిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించే సందర్భాల్లో స్థానిక జడ్పీటీసీలు, ఎంపీపీలను ఆహ్వానించకుండా అధికారులు ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తున్నారని చైర్‌పర్సన్ తీవ్రంగా ఆక్షేపించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను పక్కనబెట్టి కార్యక్రమాలు నిర్వహించడం తగదని, ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

తీరప్రాంతాల్లో తాగునీటి సమస్యలపై తక్షణ చర్యలు అవసరం
జిల్లాలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా కృత్తివెన్ను వంటి తీర ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని చైర్‌పర్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఫిల్టర్ చేయని అపరిశుభ్రమైన నీటిని సరఫరా చేయడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని ఆమె పేర్కొన్నారు. దీనిపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అత్యవసరంగా స్పందించి, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేలా సమగ్ర చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి
గ్రామీణాభివృద్ధి వేగవంతం కావాలంటే స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయకుండా, అవసరమైన నిధులు సమయానికి కేటాయించి, అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ యంత్రాంగం ముఖ్య లక్ష్యంగా ఉండాలని ఆమె స్పష్టం చేశారు.

సమావేశంలో జెడ్పీ సీఈవో డాక్టర్ జే అరుణ, డిప్యూటీ సీఈవో డాక్టర్ ఆనంద్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు ఎంఎస్ బేగ్, ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు, ఉమ్మడి కృష్ణాజిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...