Skip to main content

దేవరపల్లి గ్రామంలో పిఎసిఎస్ భవన నిర్మాణానికి శంకుస్థాపన

పామర్రు :

తోట్లవల్లూరు మండలం దేవరపల్లి గ్రామంలో పిఎసిఎస్  (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం) భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. 

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి, కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంకు ( కేడిసిసి ) చైర్మన్ 
నెట్టెం రఘురామ్, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి  ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా నెట్టెం రఘురామ్ మాట్లాడుతూ, సహకార రంగం బలోపేతం ద్వారానే రైతుల ఆర్థికాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. పిఎసిఎస్  ద్వారా రైతులకు సకాలంలో తక్కువ వడ్డీ రుణాలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు మరియు అవసరమైన వ్యవసాయ సదుపాయాలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. దేవరపల్లి గ్రామంలో నిర్మాణం ప్రారంభమైన ఈ పిఎసిఎస్ భవనం రాబోయే కాలంలో రైతులకు నమ్మకమైన సేవా కేంద్రంగా రూపుదిద్దుకుని, వారి ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా  మాట్లాడుతూ, గ్రామీణాభివృద్ధికి సహకార సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, రైతులకు అందుతున్న సేవలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పిఎసిఎస్ నిర్మాణం గ్రామానికి అభివృద్ధి దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని పేర్కొన్నారు.

కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి మాట్లాడుతూ, సహకార వ్యవస్థ బలోపేతం అయితేనే రైతు కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతాయని అన్నారు. నెట్టేం రఘురామ్ నాయకత్వంలో సహకార బ్యాంకింగ్ వ్యవస్థ మరింత ప్రజలకు చేరువవుతోందని, రైతులకు అవసరమైన సేవలు సులభంగా అందుతున్నాయని ఆయన అభినందించారు. ఈ పిఎసిఎస్ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో దేవరపల్లి పిఎసిఎస్ ప్రెసిడెంట్ బొమ్ము శివ నాగిరెడ్డి, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొల్లి శ్రీనివాస్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరేపల్లి జయరాజు, దేవరపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...