Skip to main content

మచిలీపట్నం టిడిపి కార్యాలయంలో ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి

మచిలీపట్నం :

మచిలీపట్నం టిడిపి కార్యాలయంలో డా. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. దేశానికి అత్యుత్తమ సేవలు అందించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ జగ్జీవన్ రామ్ అని తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం నాయకులు పేర్కొన్నారు. మచిలీపట్నం ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా టిడిపి సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్ బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ పి. వి. ఫణి కుమార్ మాట్లాడుతూ, డా. బాబూ జగ్జీవన్ రామ్ మితభాషి, ప్రజాసేవకు అంకితభావంతో పనిచేసిన మహానుభావుడని పేర్కొన్నారు. జమిందారీ కుటుంబానికి చెందిన ఆయన తన ఆస్తులను ప్రజల సేవలో వినియోగించారని, రక్షణ శాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని తెలిపారు. ఆయన చూపిన మార్గంలోనే బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కట్టుబడి పనిచేయాలని అన్నారు.
టౌన్ పార్టీ అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి మాట్లాడుతూ, డా. బాబూ జగ్జీవన్ రామ్ సామాజిక సమానత్వం కోసం అహర్నిశలు కృషి చేసిన మహానేత అని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు అపారమని, సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కలగాలనే లక్ష్యంతో పనిచేశారని తెలిపారు. ఆయన చూపిన మార్గం నేటి రాజకీయ నాయకులు, యువత అనుసరించాల్సిన ఆదర్శమని అన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి బురకా బాలాజీ, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొడాలి మోషే, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు చీలి సుమన్, రూరల్ ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగం విజయ్, ఎస్సీ సెల్ సీనియర్ నాయకులు చిట్టూరి యువరాజు, చిన్నం శేఖర్, కొడాలి అంజిబాబు, నాగమ్మ, పాలపర్తి పద్మ, లంకిశెట్టి నీరజ తదితరులు మాట్లాడుతూ, డా. బాబూ జగ్జీవన్ రామ్ జీవితం సమాజంలోని బడుగు, బలహీన వర్గాలకు ఒక దారిదీపంలా నిలిచిందని పేర్కొన్నారు. ఆయన ఎదుర్కొన్న అనేక సవాళ్లను ధైర్యంగా అధిగమించి, సమానత్వం కోసం సాగించిన పోరాటం ప్రతి ఒక్కరికి ఆదర్శమని అన్నారు. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ సామాజిక న్యాయం, సమాన హక్కుల సాధన కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.
ఇంకా వారు మాట్లాడుతూ, నేటి తరానికి ఆయన ఆలోచనలు మరింత అవసరమని, యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకుని, సమానత్వం మరియు న్యాయం కోసం కట్టుబడి పని చేయాలని తెలిపారు. డా. బాబూ జగ్జీవన్ రామ్ సేవలను స్మరించుకోవడం మాత్రమే కాకుండా, ఆయన చూపిన మార్గంలో నడవడం ద్వారానే నిజమైన నివాళి అర్పించినట్టవుతుందని స్పష్టం చేశారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...