మచిలీపట్నం :
రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి అర్జీలు పెట్టుకున్న నలుగురితో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం మధ్యాహ్నం స్వయంగా మాట్లాడారు.
బాపులపాడు మండలం కొత్తపల్లి గ్రామం నివాసి వాసిరెడ్డి సూర్యప్రసాద్, గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చెందిన గంజి భాస్కరరావు, మొవ్వ మండలం నిడుమోలు గ్రామానికి చెందిన బత్తిన ఈశ్వరరావు, పెనమలూరు మండలం ఫోరంకి గ్రామానికి చెందిన తాడిగడప నివాసి దుర్గాప్రసాద్ భూ విభజన, ఎస్సీ బ్యాక్లాగ్ ఖాళీ నియామకం, భూముల నష్టపరిహారం, నిషేధిత జాబితా నుండి భూముల తొలగింపు అంశాలపై పరిష్కారం కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు.
ఈ విషయమై జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో అర్జీదారుల సమస్యలకు అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలించి వారికి ఎండార్స్మెంట్లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో మీ కోసం నోడల్ అధికారి విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ పోతురాజు పాల్గొన్నారు.
Comments
Post a Comment