Skip to main content

నోరుందని అడ్డగోలుగా వాగితే తాట వలిచేస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర

అక్రమాలపై చర్యలు తీసుకుంటే అధికారుల్ని బెదిరిస్తావా?

కులాలు, మతాల పేరుతో బందరులో కుట్రలు చేస్తే సహించేది లేదని పేర్ని నానికి మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్

మచిలీపట్నం :

మచిలీపట్నంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను అధికారులు తొలగిస్తే పేర్ని నాని ఎందుకు అంత రాద్ధాంతం చేస్తున్నాడో సమాధానం చెప్పాలని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. అక్రమ కట్టడాలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు వ్యవహరించిన వైఖరి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి నిర్మాణాలు చేపట్టిన విషయం వాస్తవం కాదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారుల ముందు, పెద్దల సమక్షంలో కట్టడాలు చేయమని హామీ ఇచ్చి, రాత్రికి రాత్రే అక్రమ నిర్మాణాలు చేపడితే అధికారులు చూస్తూ ఊరుకుంటారా? నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్న కమిషనర్, ఎస్పీ, సీఐ వంటి అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. అధికారులు తమ విధులు నిర్వహిస్తుంటే నీకెందుకు అంత నొప్పి. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు చిలకలపూడి ప్రాంతంలో పేదల ఇళ్లు కూల్చివేసిన ఘటనలో కూడా నాని పాత్ర ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 130 అడుగుల రోడ్డు పేరుతో యాదవ సోదరుల ఇళ్లను కూల్చివేయాలని ప్రయత్నించిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదని హెచ్చరించారు. గాంధీ బట్టల దుకాణం విషయంలో జరిగిన ఘటనలో ఆయన మానసికంగా ఇబ్బంది పడటానికి కారణం పేర్ని నాని కాదా? పేర్ని నాని లాంటి వ్యక్తిని కన్నందుకు వారి తల్లిదండ్రుల ఆత్మ క్షోభిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రికి ఒక్కరోజైనా అన్నం పెట్టావా అని నిలదీశారు. గత 5 సంవత్సరాలుగా రామ్ నితీష్ మాల్ నిర్మాణాన్ని అడ్డుకున్న విషయం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బైపాస్ రోడ్ విషయంలోనూ అనేక వివాదాలు తలెత్తాయి. ఎన్ని పాపాలు చేశావు నాని… నువ్వు అసలు మనిషివేనా అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వానికి కులాల మతాలు లేవు. ప్రజల కోసమే పని చేస్తున్నామని స్పష్టం చేశారు.మీ మున్సిపల్ పదవీకాలం ముగిసిన తర్వాతే భోగరాజు పట్టాభి సీతారామయ్య భవనం నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. వంగవీటి రంగా హత్యలో సంబంధం ఉన్న వ్యక్తులను ఇంటికి పిలిచి విందులు పెట్టిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మేము ఎప్పుడూ ధర్మ పక్షాన నిలబడతాము. ఇప్పటికే 2600 జి+3 ఇళ్లు నిర్మించి అర్హులైన వారికి అందించామని తెలిపారు. ఇళ్ల పంపిణీ విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తున్నాం.. డ్రైనేజీ వ్యవస్థను ఫేజ్ వైజ్‌గా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పేర్ని నాని అర్ధరాత్రి సమయంలో దొంగ పట్టాలు ఇచ్చిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అధికారులను బలిచేసింది పేర్ని నాని అని విమర్శించారు. ధర్మం ప్రకారం ముందుకు సాగుతామని, ఎవరైనా నష్టపోతే వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ అధికారులను వారి విధులు నిర్వహించుకోవాలని, బాధ్యత గల రాజకీయ నాయకుడిలా ప్రవర్తించాలని హెచ్చరిస్తూ, ఇకపై అధికారులు కాలర్ ఎత్తుకుని పనిచేసేలా ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...