Skip to main content

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా: మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం :

అత్యంత అధునాతనమైన పరిజ్ఞానంతో లోవోల్టేజ్ సమస్య అధిగమించి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

ఆదివారం ఉదయం నగరంలోని 14 వ డివిజన్ బచ్చుపేట ప్రాంతంలో 6.30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ సెమీ ఇండోర్ విద్యుత్ ఉప కేంద్రానికి మంత్రివర్యులు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణలతో కలిసి శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ 
ఈ విద్యుత్ ఉప కేంద్రం మొత్తం కూడా అత్యంత అధునాతనమైనటువంటి పరిజ్ఞానంతో ఇండోర్ విద్యుత్ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని, కేబుళ్లు ఎక్కడా కూడ బయటకు కనబడకుండా భూమి లోపల ఉంటాయన్నారు.. దీనివల్ల మన బుట్టాయపేట, రామానాయుడుపేట, ఇంగ్లీష్ పాలెం, భాస్కర పురం, చిలకలపూడి వరకు కూడా ఈ సబ్ స్టేషన్ నుంచి మరి కేబుళ్లు అన్నీ కూడా విద్యుత్ సరఫరా అవుతాయన్నారు. దీనివల్ల మిగతా సబ్ స్టేషన్ ల మీద లోడ్ తగ్గుతుందనీ. లో వోల్టేజ్ సమస్య అనేది రాదన్నారు. ఈ కేబుళ్లు అన్ని పనిచేయకపోవడం అనేది జరగదన్నారు. అందుకనే ఈ సబ్ స్టేషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

 ముఖ్యంగా మన మచిలీపట్నం నగరంలో మొత్తం 74000 కనెక్షన్స్, గ్రామీణ ప్రాంతంలో 30 వేల విద్యుత్ కనెక్షన్స్ ఉన్నాయన్నారు. దాదాపు 3500 ఆక్వా చెరువులకు విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయన్నారు.. ఆక్వాకు కేవలం రూపాయిన్నరకే విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. ఎస్సీ సోదరులకి కూడా 200 యూనిట్ల లోపల ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తున్నామన్నారు. అదేవిధంగా నాయీ బ్రాహ్మణ సోదరులకి 200 యూనిట్లు, చేనేత కార్మికులకు 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్తు అందిస్తున్నామన్నారు.
ఇవాళ ఇవన్నీ కూడా ఇవ్వగలుగుతున్నామంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ , విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ విద్యుత్ మీద ప్రత్యేక దృష్టి పెట్టడమేనన్నారు.

పీఎం సూర్య ఘర్ పథకం కింద రెండు కే.వి.ల సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే 78000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నామన్నారు. అదే ఎస్సీ, ఎస్టీ సోదరులకైతే పూర్తిగా ఉచితమనీ అంటే లక్షా 20వేల రూపాయలు ప్రభుత్వమే భరిస్తోందన్నారు. అలాగే బీసీ సోదరులకు ఇంకో 20,000 రూపాయలు అదనంగా ఇస్తున్నామన్నారు .

సూర్య కుసుం కింద రైతులు కూడా సబ్సిడీతో పెట్టుకోవచ్చన్నారు. పంపు వాడుకున్నప్పుడు పంపు వాడుకుంటాం లేదంటే అది గ్రిడ్ కి ఇస్తే ఇంకా డబ్బులు మనకే వస్తాయన్నారు. ప్రజలు రైతులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు
ఈరోజు ఒక మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకి అందరూ కూడా సహకరించాలన్నారు.  

ఇవాళ మొత్తం 132 కెవి ఉపకేంద్రం డంపింగ్ యార్డ్ దగ్గర ఉందని, 132 కేవీ అంటే మెయిన్ ఫీడర్ అక్కడి నుంచి మనకు విద్యుత్తు వస్తుందనీ, అక్కడి నుంచి ఉలింగిపాలెం, ఇనుగుదురు, పంపుల చెరువు బి1లో ఉంటుందని. అలాగే బి2 సెక్షన్ కింద మన ఎం పిడిఓ కార్యాలయం లో ఒకటి ఉంది, హౌసింగ్ బోర్డు ఒకటి సబ్ స్టేషన్ ఉందన్నారు. మళ్ళీ మూడు నెలల తర్వాత, జూలైలో వచ్చి ప్రారంభిస్తామన్నారు

ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ రావు మాట్లాడుతూ
నాణ్యమైన విద్యుత్తు ఇవ్వాలి అంటే సబ్ స్టేషన్లు అవసరం ఉందన్నారు. ఇందుకోసం ఇప్పటికే. చాలా సబ్ స్టేషన్ నిర్మించడం జరిగిందన్నారు. ఇవాళ నగరం నడిబొడ్డున మరి సబ్ స్టేషన్ నిర్మించాలాంటే కనీసం ఒక ఎకరం రెండు ఎకరాల స్థలం కావాల్సి ఉంటుందన్నారు.
ప్రస్తుతం ఇండోర్ విద్యుత్ కేంద్రం అనే ఒక కొత్త మోడల్ లో. ఏర్పాటు చేస్తున్నామని, అందులో వైర్లన్నీ కూడా భూమి లోపల వస్తాయన్నారు. ఎక్కువ స్థలంలో కాకుండా తక్కువ స్థలంలోనే 33/11 కేవి సబ్స్టేషన్ అధునాతన పరిజ్ఞానంతో ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. వచ్చే వేసవి కాలానికి లోవల్టేజ్ సమస్య లేకుండా ఇబ్బందులన్నీ తీరుతాయన్నారు.

ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ ఈ రవీంద్రబాబు,  మునిసిపల్ సహాయ కమిషనర్ గోపాలరావు, డిసిఎంఎస్ అధ్యక్షులు బండి రామకృష్ణ, విద్యుత్ శాఖ ఈ ఈ గోవిందరావు, డి ఈ రామకృష్ణ, ఏ ఈ రమణ, రాష్ట్ర మైనారిటీ ఆర్థిక సంస్థ డైరెక్టర్ హసీం బేగ్, స్థానిక నాయకులు వెంకటస్వామి, మురళీకృష్ణ, రత్నాకర్, సుశీల మాదివాడ రాము, వెంకన్న తదితర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...