మచిలీపట్నం :
ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శిగా నియమించబడిన మాటూరి రంగనాథ్ అభినందనీయుడని పలువురు వక్తలు కొనియాడారు. కృష్ణాజిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సన్నిధి నాగ సాయి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాటూరి రంగనాధ్ ను ఆదివారం స్థానిక బైపాస్ రోడ్ లోని వాసవి భవన్లో ఘనంగా సత్కరించారు.
తొలుత ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వాసవి మాతను కోరుతూ 101 కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం రంగనాథ్ ను ఘనంగా సత్కరించారు. గుడివాడకు చెందిన రంగనాథ్ అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమన్నారు. రంగనాథ్ కృష్ణా జిల్లావాసి కావడం మనకు గర్వకారణం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు చక్కా చెన్నకేశవరావు, మామిడి ప్రసాద్, వేముల కృష్ణ, వేముల శ్రీనివాస్, వెచ్చా మల్లికార్జున గుప్తా, మండల శాఖల బాధ్యులు పాల్గొన్నారు.
Comments
Post a Comment