Skip to main content

దొంగ పై పిడి యాక్ట్ తో చెక్ .... కృష్ణాజిల్లా పోలీసులు

మచిలీపట్నం :

ప్రజా భద్రతకు భంగం కలిగించేలా ఏ ఒక్క వ్యక్తి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసినా వారిపై చట్టంతో కొరడా ఝుళిపిస్తామని జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. అంతర్ జిల్లాలలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ వివిధ జిల్లాల్లోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 70 కు పైగా క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా నమోదైన ఆరేపల్లి దుర్గారావు 38 సంవత్సరాలు నవీన్ మిట్టల్ కాలనీ అలవాటుదారుడిపై జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు. ప్రజా శాంతి భద్రతలను పరిరక్షించే దిశగా అతనిపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పి.డి.) యాక్ట్‌ను అమలు చేశారు.

గత కొంతకాలంగా వివిధ జిల్లాలలో దొంగతనాలు, ఇతర ఆస్తి సంబంధిత నేరాలకు పాల్పడుతూ ప్రజలలో భయాందోళనలు సృష్టిస్తున్న ఈ నిందితుడిపై సమగ్ర విచారణ చేసి, పలు కేసుల్లో అరెస్టయి, జైలు శిక్ష అనుభవించినప్పటికీ తన నేర ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో, సమాజానికి ముప్పుగా మారిన ఈ వ్యక్తిని నియంత్రించేందుకు పి.డి. యాక్ట్ అమలు చేశారు. ఇతనికి సంబంధించిన నేర నివేదికను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కి పంపగా నిజనిర్ధారణ కావడంతో అతనిపై పిడి ఆక్ట్ ప్రయోగించేలా ఉత్తర్వులు జారీ చేయడంతో అతడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
 
ఈ పిడి యాక్ట్ ద్వారా నేర కార్యకలాపాలను నిరోధించడంతో పాటు, ప్రజల ఆస్తి భద్రతను కాపాడటమే ముఖ్య ఉద్దేశమని ఎస్పీ వెల్లడించారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అలవాటుదారులపై భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆరేపల్లి దుర్గారావు పై పీడీ యాక్ట్ అమలు పరచడానికి కృషిచేసిన బందరు ఇన్చార్జి డిఎస్పి శ్రీనివాసరావు , ఆర్ పేట ఇన్స్పెక్టర్ కె. యేసు బాబు, బందర్ తాలూకా ఎస్సై సత్యనారాయణ, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...