మచిలీపట్నం:
పదవ తరగతి మూల్యాంకనానికి సర్వం సంసిద్ధంగా ఉందని, కృష్ణాజిల్లా డిఇఓ యు వి సుబ్బారావు అన్నారు.
ఆదివారం నగరంలో లేడీయాంప్థిల్ గర్ల్స్ ఉన్నత పాఠశాలలో సోమవారం నుండి నిర్వహించబోతున్న పదవ తరగతి మూల్యాంకన ఏర్పాట్లు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారి యు.వి. సుబ్బారావు తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఇప్పటికే చీఫ్ ఎగ్జామినర్ లను అసిస్టెంట్ ఎగ్జామినర్ లను, స్పెషల్ అసిస్టెంట్ల నియామకం చేపట్టడం జరిగిందని మూల్యాంకనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని అన్నారు.
మొత్తం 1,84,000 పరీక్ష పత్రాలు కేంద్రానికి చేరాయన్నారు. మూల్యాంకనంలో పాల్గొనే ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు అవసరమైన సదుపాయాలు, భద్రతా చర్యలు, పత్రాల నిర్వహణ ఇతర విధి విధానాలను సమీక్షించామన్నారు.
అలాగే మూల్యాంకన ప్రక్రియ పారదర్శకంగా, సమయపాలనతో జరగాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశామన్నారు. సోమవారం నుండి ఈ నెల 15వ తేదీ వరకు మూల్యాంకన ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. పరీక్షల నిష్పత్తి , నాణ్యతను కాపాడే విధంగా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత విద్యాశాఖ అధికారులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Post a Comment