జిల్లా స్థాయి అప్రోప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశంలో నిర్ణయం
మచిలీపట్నం:
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో డిస్ట్రిక్ట్ లెవెల్ మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశం, సరోగసి పై డిస్ట్రిక్ట్ లెవెల్ అప్రోప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో కొత్త రిజిస్ట్రేషన్, మార్పులు చేర్పులు (మోడిఫికేషన్), అదేవిధంగా పునరుద్ధరణ (రెన్యువల్) కోసం స్కాన్ సెంటర్లు సమర్పించిన దరఖాస్తులను, సంబంధిత ఇన్స్పెక్షన్ నివేదికలను కమిటీ సమగ్రంగా పరిశీలించింది. ఈ సందర్భంగా కొత్తగా రిజిస్ట్రేషన్ కోసం ఒక స్కాన్ సెంటర్ అయిన శ్రీ అనంత హాస్పిటల్ దరఖాస్తును పరిశీలించి అనుమతి మంజూరు చేశారు.
అలాగే మార్పులు చేర్పులు కోరుతూ ఐదు స్కాన్ సెంటర్లు దరఖాస్తు చేసుకోగా, వాటిని కూడా కమిటీ పరిశీలించి అనుమతులు మంజూరు చేసింది.
అవి
కీర్తి హాస్పిటల్, చల్లపల్లి
అమెరికన్ అంకోలజీ – నాగార్జున హాస్పిటల్ క్యాంపస్
సాయి సామాన్య హాస్పిటల్, పోరంకి
ఎస్.డి. హెల్త్ కేర్ హాస్పిటల్
పిన్నమనేని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, గన్నవరం
పునరుద్ధరణ (రెన్యువల్) కోసం రెండు స్కాన్ సెంటర్లు దరఖాస్తు చేసుకోగా, వాటికీ కమిటీ అనుమతులు మంజూరు చేసింది. అవి:
శ్రీ కాళీ నర్సింగ్ హోమ్, పెడన
రవి ప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, మొవ్వ
సమర్పించిన దరఖాస్తులు, ఇన్స్పెక్షన్ నివేదికలు సంబంధిత ప్రమాణాలను పరిశీలించిన అనంతరం, అన్ని దరఖాస్తులకు జిల్లా కలెక్టర్ అనుమతి మంజూరు చేసినట్లు సమావేశంలో వెల్లడించారు.
సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి. యుగంధర్, అదనపు ఎస్పీ వి.వి. నాయుడు, గైనకాలజిస్ట్ డాక్టర్ సాహితి, ఎన్జీవో సభ్యులు ఎం. ధర్మతేజ, కే. సుశీల తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment