Skip to main content

పూర్ణ వందేమాతరం గీతం ఆలాపన కార్యక్రమం


మచిలీపట్నం :

      భారత జాతీయ గేయం వందేమాతరం గీతాన్ని రచించి 150 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో పూర్ణ వందేమాతర గీతాలాపన కార్యక్రమాన్ని భారత్ వికాస్ పరిషత్, ఏపీ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రారంభించారు. 
       స్థానిక ఇనుగుదురుపేట నాగార్జున పబ్లిక్ స్కూల్ నందు ఉదయం 8 గంటలకు భారత్ వికాస్ పరిషత్ అధ్యక్షులు ప్రసాద్ ప్రారంభ సందేశాన్ని ఇస్తూ 1870 సంవత్సరంలో బంకిమ్ చంద్ర ఛటర్జి బెంగాలీ, సంస్కృతంలో రచించిన భారత జాతీయ గీతం మొదటిగా ఆనంద్ మఠం నవలలో ప్రచురించబడినది. స్వాతంత్రోద్యమంలో దేశభక్తిని రగిలించింది. వందేమాతరం, జనవరి 24 1950వ సంవత్సరం భారత రాజ్యాంగ సభ దీనిని జాతీయగీతం గా ఆమోదించటం తెలిపిందని తెలియజేసినారు. 
         ఈ సందర్భంగా ఏపీ ప్రైవేట్ స్కూలు అసోసియేషన్ మచిలీపట్నం డివిజన్ అధ్యక్షులు ఎం వెంకట నరసయ్య వందేమాతరం మీద నినాదాలు చేసినారు. ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు వి సుందర రావు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఎంతో విలువైనదని ప్రతి విద్యార్థికి పూర్ణ వందేమాతరం వచ్చే విధంగా కృషి చేయాలని ఈ గీతాలాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు సంఘ సభ్యులను అభినందిస్తూ పూర్ణ వందేమాతర గీతాలాపన ప్రారంభించవలసిందిగా కోరారు. 
        చిన్నారి గాయని కుమారి కోమలి భ్రమరాంబిక పూర్ణ వందేమాతర గీతాన్ని ఆలపించగా విద్యార్థులందరూ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో భారత్ వికాస్ పరిషత్ ఫైనాన్స్ సెక్రటరీ వివి రమణ, సంయుక్త కార్యదర్శి ఐ.వి.వి కుమార్, ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు స్వామి, కార్యదర్శి కవిత, విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు ఆవోపా ఉపాధ్యక్షులు పులవర్తి శ్రీనివాస్, వివిధ విద్యాసంస్థల అధినేతలు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...