మచిలీపట్నం :
గ్రామీణ వైద్యుల సేవలు అనన్య సామాన్యమని, డీఎంహెచ్వో డాక్టర్ యుగంధర్ అన్నారు. మంగళవారం గ్రామీణ వైద్యులు , రాష్ట్ర గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రిజిస్టర్ ప్యానెల్ నాయకులు అధ్యక్షులు డాక్టర్ బి.ఆర్ ఆంజనేయులు, కార్యదర్శి నందగోపాల్, జాయింట్ సెక్రటరీ బి ఆర్ ఆర్ సందీప్ కుమార్, కోశాధికారి. డేవిడ్ రాజు కృష్ణా జిల్లా కోశాధికారి తటవర్తి వాసుదేవ మూర్తి, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నాయకులు దుర్గా రావు, బి అర్జున్ రావు,జవహర్ పీటర్ తదితరులు స్థానిక డిఎంహెచ్వో కార్యాలయంలో యుగంధర్ ను కలిసి గ్రామీణ వైద్యుల సాధక బాధకాలు తెలియజేశారు.
రాష్ట్రస్థాయిలో గ్రామీణ వైద్యులు చేస్తున్న సేవలను ఈ సందర్భంగా యుగంధర్ కొనియాడారు. ఇదే స్పూర్తితో, రాష్ట్ర ప్రభుత్వ డాక్టర్లకు నర్సింగ్ సిబ్బందికి సహకరించాలని కోరారు. అలాగే గ్రామీణ వైద్యులు తమ పరిధిలో వైద్య సేవలు అందించాలని నగరంలో ఇంకా కొంతమంది తమ పరిధి దాటి చేసే వైద్యానికి, యూనియన్ నాయకులు సంపూర్ణ బాధ్యత తీసుకోవాలని గ్రామీణ వైద్యుల సమావేశానికి ఆహ్వానిస్తే తాను తప్పక హాజరవుతానని డిఎంహెచ్వో అన్నారు. గ్రామాల పరిధిలో ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలు గ్రామీణ వైద్యులు చేపట్టాలని, సంబంధిత జిల్లాల్లో మండల పంచాయతీ విభాగాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్యక్రమాలకు డివిజన్ వారీగా గ్రామీణ వైద్యులు తమ తమ ఐడి కార్డ్స్ అసోసియేషన్ల అప్డేట్ రెన్యువల్సు పూర్తిచేసుకుని వారి వద్దే ఉంచుకొని సంబంధిత అధికారులు వచ్చినప్పుడు అందజేయవలసిందిగా తెలియజేశారు.
ప్రతి మూడు నెలలకు యూనియన్ యొక్క సర్వసభ్య సమావేశాలు ఏర్పాటు చేసుకొని సభ్యులు తప్పనిసరిగా అసోసియేషన్ నిబంధనలు పాటించి ప్రధమ చికిత్స నిబంధనలకు అనుగుణంగా వైద్య సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా మండల నాయకులు హాజరై డిఎంహెచ్వో ఆదేశాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Post a Comment