ఎయిర్ పోర్టు లో టీడీ జనార్ధన్ కు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపిన పలువురు నేతలు
విజయవాడ:
తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు టిడి జనార్ధన్ జన్మదినం సందర్భంగా సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబా ఆయనకు గన్నవరం విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ నుండి వస్తున్న ఆయనకు విమానాశ్రయంలో ఫకీర్ల మేళతాళములతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సత్కరించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, తెలుగుదేశం పార్టీలో లో ఉన్నతమైన స్థానంలో ఉండాలని ప్రార్ధించారు. ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూఖ్ షూబ్లీ ఆధ్వర్యంలో వందలాది మంది అభిమానులు విమానాశ్రయం చేరుకొని టిడి జనార్ధన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. గన్నవరం హుస్సేన్ మౌలానా మదర్సా పిల్లలు గులాబి పూలతో శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం జనార్దన్ అభిమానులు 50 కార్లతో ర్యాలీ నిర్వహించగా, తెలుగుదేశం కేంద్ర కార్యాలయం చేరుకున్న టిడి కు పలు కార్పొరేషన్ ల చైర్మన్ లు, సభ్యులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
జగ్గయ్యపేట మండలం లింగాల గ్రామం లో 73 కిలోల కేక్ ను అభిమానులు, జనార్దన్ తో కట్ చేయించారు. జనార్దన్ పుట్టినరోజు సందర్భంగా జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిగురు సంస్థలో ప్రత్యేక హెల్త్ క్యాంప్ నిర్వహించారు.
Comments
Post a Comment