Skip to main content

గుర్రపు డెక్క హస్తకళాకృతులకు మార్కెట్లో డిమాండ్ : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ


మచిలీపట్నం:

గుర్రపు డెక్కతో తయారుచేసిన వివిధ రకాల హస్తకళాకృతులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని అందుకు తగ్గట్టుగా వాటిని సరఫరా చేసేందుకు మహిళలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు.

మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ పెడన మండలంలోని చేవేండ్ర గ్రామము, బంటుమిల్లి మండలంలోని మనిమేశ్వర పంచాయతీలోని లేల్లగూడెంలో ఆకస్మికంగా పర్యటించారు. 
ఈ సందర్భంగా కలెక్టర్ అక్కడ సేర్ఫ్, డి ఆర్ డి ఏ, వెలుగు ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు గుర్రపుడెక్కతో వివిధ హస్త కళాకృతుల తయారీలో శిక్షణ ఇస్తున్న నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను పరిశీలించారు. 

అక్కడి మహిళలతో జిల్లా కలెక్టర్ మమేకమై మాట్లాడుతూ అస్సాం నుంచి కళాకారులను జిల్లాకు పిలిపించామని మచిలీపట్నం మండలంలోని చిన్నాపురం గ్రామంలో స్వయం సహాయక సంఘాల మహిళలు 30 మందికి గుర్రపు డెక్క తో వివిధ రకాల బుట్టలు, చాపలు వంటి హస్త కళాకృతులు తయారు చేయుటలో శిక్షణ ఇప్పించామన్నారు.గత ఒకటిన్నర సంవత్సరం పైగా నడుస్తోందన్నారు. శిక్షణ ఇప్పించడం సులువవుతుందని దాన్ని మార్కెటింగ్ చేయడానికి ఏమైనా కష్ట పడవలసి వస్తుందని తాను భావించానన్నారు. కానీ అది తిరగబడిందని కొనేదానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారని, వారు ఆర్డర్ ఇస్తే అందుకు అనుగుణంగా ఇచ్చిన తేదీలోగా వస్తువులు సరఫరా చేయలేకపోతున్నామన్నారు. 
ఇందుకు కారణం కొద్దిమంది మహిళలే వస్తువులు తయారు చేయడం వలన ఇబ్బంది ఎదురవు తుందన్నారు. ఈ పరిస్థితులను అధిగమించడానికి కేవలం చిన్నాపురం మహిళలకే పరిమితం కాకుండా జిల్లా వ్యాప్తంగా ఎక్కువ మంది మహిళలకు శిక్షణ ఇవ్వాలని నిశ్చయించామన్నారు. ఇందులో భాగంగానే జిల్లాలో 1000 మంది మహిళలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.

చిన్నాపురంలో ఇదివరకే శిక్షణ పొందిన మహిళల చేతనే మిగతా వారికి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.కేవలం 20 రోజుల్లోనే బుట్టలు, చాపలు వంటి అల్లికలు నేర్చుకోవడం ఆశ్చర్యంగా ఉందని చాలా బాగా చేశారని కలెక్టర్ మహిళలను అభినందించారు. 

ప్రస్తుతం చేతిలో 20 లక్షల రూపాయల మేరకు ఆర్డర్ ఉందన్నారు. ప్రభుత్వము నుండి ఆర్డర్ తీసుకున్నాం గనుక ఆలస్యమైన వారికి నచ్చజెప్పి ఆర్డర్ను నిలబెట్టుకున్నామన్నారు.

కొద్ది రోజులు ఓపిక పడితే తర్వాత మళ్లీ మళ్లీ ఆర్డర్లు వస్తాయన్నారు. బెంగళూరు, హైదరాబాదులో ఉన్న కంపెనీలు దసరా, క్రిస్మస్ నూతన సంవత్సరాలకు వారి ఉద్యోగులందరికీ బహుమతులు ఇచ్చేందుకు గుర్రపు డెక్క పెట్టెలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.

అనంతరం కలెక్టర్ లేల్లగూడెంలో 9వ తరగతి విద్యార్థులతోనూ, వాలంటీర్లతోనూ ముఖాముఖి మాట్లాడారు. ఉదయాన్నే లేచి చదువుకుంటున్నారా లేదా పదో తరగతి పాఠ్యపుస్తకాలు అందాయా లేదా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్లో కొంతైనా మార్పు వచ్చిందా లేదా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట డిఆర్డిఏ పిడి హరి హరినాథ్, తహసిల్దారు అనిల్ కుమార్ పలువురు స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...