Skip to main content

బాణసంచా పేలుడు గాయపడిన పోలీసులు క్షేమంగా డిస్చార్జ్..

మచిలీపట్నం :

బాణసంచా పేలుడు ఘటనలో గాయపడిన పోలీసు సిబ్బంది సురక్షితంగా కోలుకుని డిశ్చార్జ్ కావడం ఎంతో ఆనందదాయకమైన పరిణామం అని జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు అన్నారు. మార్చి 31వ తేదీన ప్రమాదవశాత్తు బాణసంచా పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన సిబ్బందిని ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మంగళగిరి ఎన్ఆర్ఐ వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స అందుకుని సోమవారం క్షేమంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్న కోర్ట్ కానిస్టేబుల్ అబ్దుల్లా, కానిస్టేబుల్ నాగరాజు లను వారిని పరామర్శించేందుకు జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు పోలీసు అధికారులతో కలిసి ఆసుపత్రికి వెళ్లి వారి యొక్క ఆరోగ్య స్థితిగతులు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. 

ప్రమాదం జరిగిన నాటినండి జిల్లా ఎస్పీ ఎప్పటికప్పుడు వారి యొక్క ఆరోగ్య పరిస్థితులపై సమాచారం తెలుసుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు అందించవలసిన భరోసాను అందజేస్తూ వారికి సహాయకారిగా ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందిని నియమించారు. చికిత్స పొందుతున్న కాలంలో ప్రతి దశలోనూ జిల్లా ఎస్పీ వ్యక్తిగతంగా వారి ఆరోగ్య స్థితిగతులపై ఎప్పటికప్పుడు వాకబు చేస్తూ, వైద్యులతో నేరుగా మాట్లాడి ఉత్తమ చికిత్స అందేలా పర్యవేక్షించారు. గాయపడిన పోలీస్ సిబ్బందిని పరామర్శించేందుకు రాష్ట్ర హోంశాఖ మాత్యులు వంగలపూడి అనిత విచ్చేసి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకుని ఇంకా మెరుగైన వైద్యం అందజేయాలని ,వారు క్షేమంగా తిరిగి వారి విధులకు చేరేలా చూడాలని సూచనలు చేశారు. అంతేకాక వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మీకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ,కృష్ణా జిల్లా పోలీస్ శాఖ వెన్నంటే ఉందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర , వాసంశెట్టి సుభాష్ , ఇతర ప్రజాప్రతినిధులు క్షతగాత్రులైన వారిని పరామర్శించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిలో ధైర్యాన్ని నింపారు. ఏలూరు రేంజ్ ఐజిపి జి.వి.జి.అశోక్ కుమార్ క్షతగాత్రులైన వారిని కలిసి, వారికి వైద్య సదుపాయం ఏ విధంగా అందుతున్నది అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యంగా ఉండమని తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ కర్తవ్య నిర్వహణలో భాగంగా ప్రాణాలకైనా తెగించి విధులు నిర్వర్తించే పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులే తమ కుటుంబమని, వారికి చిన్న ఇబ్బంది వచ్చినా జిల్లా పోలీస్ శాఖ అంతా ఒకటిగా నిలబడి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. 

వైద్యుల కృషి, సిబ్బంది ధైర్యం, కుటుంబ సభ్యుల ఆత్మస్థైర్యం కలిసి వారి ఆరోగ్యం మెరుగుపడటానికి కారణమయ్యాయని పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది పట్ల సమాజం చూపుతున్న ఆదరణ, మానవీయత ఎంతో ప్రేరణనిచ్చేదిగా ఉందన్నారు. సిబ్బంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అవుతున్న సందర్భంలో ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆనందాన్ని పంచుకున్నారు.

పోలీసు శాఖ ఒక కుటుంబం… ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు అందరం కలిసి నిలబడతాం- అనే భావనను ఈ ఘటన మరోసారి స్పష్టంగా తెలిపారు. కష్టసమయంలో చూపిన ఐక్యత, మనస్ఫూర్తి, సేవా భావం, పరస్పర సహకారం—ఇవన్నీ కలిసి పోలీసు వ్యవస్థ గొప్పతనాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఎస్పీ పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...