Skip to main content

మచిలీపట్నం నుండి పెనమలూరు వరకు జాతీయ రహదారిపై గల బ్లాక్ స్పాట్స్‌ను ప్రత్యక్షంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ వి విద్యా సాగర్ నాయుడు

మచిలీపట్నం :

జిల్లాలో సంభవిస్తున్న రహదారి ప్రమాదాలను సమర్థవంతంగా తగ్గించేందుకు, ముందస్తు చర్యలలో భాగంగా జిల్లా ఎస్పీ  వి. విద్యాసాగర్ నాయుడు మచిలీపట్నం నుండి పెనమలూరు వరకు గల జాతీయ రహదారి పైన ప్రమాదాలకు గురయ్యే అవకాశమున్న ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్)ను ప్రత్యక్షంగా సందర్శించి సమగ్రంగా పరిశీలించారు.

 ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాల వివరాలను, ప్రమాదాలకు దారితీసే ముఖ్య కారణాలను సంబంధిత పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
 రహదారుల నిర్మాణ పరిస్థితులు, వంకరలు (బ్లైండ్ కర్వ్స్), గుంతలు, తగినంత సైన్ బోర్డుల లేమి, రాత్రి వేళల్లో లైటింగ్ లోపం వంటి అంశాలు అన్నింటిని పరిశీలించారు. వీటిని దృష్టిలో ఉంచుకుని, సంబంధిత అధికారులకు తక్షణం మరియు దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలని ఎస్పీ  ఆదేశించారు.

ప్రత్యేకంగా, ప్రమాదాలు అధికంగా సంభవించే ప్రాంతాలను అధికారికంగా “బ్లాక్ స్పాట్స్”గా గుర్తించి, అక్కడ హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టివ్ సిగ్నేజీ, స్పీడ్ లిమిట్ సూచనలు, అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే రాత్రి వేళల్లో వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా హై విజిబిలిటీ సైన్ బోర్డులు, రేడియం స్టిక్కర్స్ తో కూడిన డ్రమ్ములు భారీ గేట్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. 

అదేవిధంగా, వాహనదారులలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించడం అత్యంత కీలకమని పేర్కొంటూ, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడింగ్, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ వినియోగం వంటి నియమాలను కఠినంగా అమలు చేయాలని ట్రాఫిక్ సిబ్బందికి సూచించారు. ప్రజల సహకారం లేకుండా రహదారి భద్రత సాధ్యం కాదని, అందువల్ల సామాజిక అవగాహన కార్యక్రమాలు మరింతగా నిర్వహించాలని తెలిపారు.

ఈ సందర్భంగా సంబంధిత పోలీసు అధికారులు, రోడ్డు రవాణా శాఖ, ఆర్ & బి విభాగం అధికారులు పరస్పర సమన్వయంతో పని చేసి, గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద వెంటనే సవరింపు చర్యలు చేపట్టి, భవిష్యత్తులో ప్రమాదాలను గణనీయంగా తగ్గించే దిశగా కృషి చేయాలని ఎస్పీ స్పష్టం చేశారు. ఇకపై కూడా బ్లాక్ స్పాట్స్‌పై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ, తరచూ తనిఖీలు నిర్వహించి, పరిస్థితులను సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...