Skip to main content

స్వచ్ఛ బందరు నిర్మిద్దాం ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేద్దాం.... మున్సిపల్ కమిషనర్ బాపిరాజు

మచిలీపట్నం :

ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించేందుకు నగర ప్రజలు ముందుకు రావాలని మున్సిపల్ కమిషనర్ బాపిరాజు పిలుపునిచ్చారు .
శుక్రవారం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 40 మంది స్వచ్ఛ సైనికులు పదవ డివిజన్లో స్వచ్ఛాయుధాలు, చీపుళ్ళు పట్టుకుని వీధులు శుభ్రం చేశారు .నాయర్ బడ్డి సెంటర్లో జిల్లా రెవెన్యూ అధికారి బంగ్లాకు దగ్గరలో ఒక బ్లాక్ స్పాటును గుర్తించారు ‌ఆ బ్లాక్ స్పాట్ లోని ప్లాస్టిక్ వ్యర్ధాలు తొలగించారు .అక్కడ ఒక మొక్క నాటేందుకు నిర్ణయం తీసుకున్నారు .మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు జి కిషోర్ కార్యదర్శి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ హసీం బాగ్ , మానవతా సంస్థ ఉపాధ్యక్షుడు సన్ స్టార్ స్కూల్ డైరెక్టర్ బొమ్మిరెడ్డి స్వామి, సన్ స్టార్ కళాశాల ప్రిన్సిపాల్ ఆదిత్య , మానవతా సంస్థ జిల్లా కో కన్వీనర్ ముదిగొండ శాస్త్రి , మానవత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యవర్గ సభ్యుడు వి సుందరరాం, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ ఏవి గోపాలరావు ,కోస్తా మురళీకృష్ణ, బొమ్మిడి శ్రీరాముల లతో పాటు సన్ స్టార్ స్కూల్ అధ్యాపకులు విద్యార్థులు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు మున్సిపల్ కమిషనర్ బాపిరాజు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
కలెక్టర్ బాలాజీ పిలుపు మేరకు మచిలీపట్నాన్ని సుందర మచిలీపట్నం గా తీర్చిదిద్దుతున్నామన్నారు ఇందుకు నగర ప్రజలు సహకరించాలన్నారు .
ప్లాస్టిక్ వ్యర్ధాలు , చెత్త రోడ్డు మీద వేయకుండా పారిశుధ్య కార్మికులు ఇంటికి వచ్చినప్పుడు అందించాలన్నారు.
మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని ,ఇందుకు ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పాటు చేసేందుకు స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టామ మన్నారు. ఇందుకు స్వచ్ఛ సైనికులు ముందుకు రావాలన్నారు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు జి కిషోర్ కుమార్ మాట్లాడుతూ స్వచ్ఛత పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకుని వచ్చేందుకు వివిధ వార్డుల్లో పర్యటిస్తున్నామన్నారు 
కార్యదర్శి డా హసీంపేట్ మాట్లాడుతూ కాలవల్లో చెత్త వేయకుండా ఉంటే కాలవలు లోని మురుగునీరు సక్రమంగా పారుతుందన్నారు ఉపాధ్యక్షుడు సన్ స్టార్ స్కూల్ విద్యార్థులు తమ ఇళ్ల వద్ద ఉండే ప్రజలను పారిశుద్ధ్య కార్మికుల వచ్చినప్పుడు వారికి చెత్త అందించేందుకు అందించాలని చెబుతున్నా లన్నారు. ఈ కార్యక్రమంలో ఓంకార్ తో పాటు సన్ స్టార్ స్కూల్ అధ్యాపకులు పాల్గొన్నారు వైట్ బాక్స్ లో మొక్కలు పెంచే కార్యక్రమం చేపడతామన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...