Skip to main content

మచిలీపట్నంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర జల ధార జల హారతి


మచిలీపట్నం:

చెత్త రహిత స్వచ్ఛ సుందర బందరు నిర్మాణానికి ప్రజలంతా ముందుకు రావాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు

స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర జల ధార జల హారతి కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం రాష్ట్ర మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి నగరంలోని జెడ్పీ సెంటర్ శ్రీ వినాయక స్వామి గుడి వద్ద గల ధర్మాన చెరువు పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. చెత్తను తొలగించే నిమిత్తం వినూత్నంగా తయారు చేసిన పట్టకార లాంటి స్వచ్ఛ ఆయుధాన్ని అందరూ చేతబూని ప్రదర్శించారు. అనంతరం మంత్రి నేతృత్వంలో అందరూ స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ
రాష్ట్రాన్యి పరిశుభ్రంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని, అందులో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు ప్రతి నెలా మూడో శనివారం “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 
మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ, వ్యాధులు పర్యావరణ సమతుల్యత లోపించకుండా చూడడమే ప్రధాన లక్ష్యంగా కార్యక్రమం నిర్వహిస్తునామన్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్నారు. మచిలీపట్నంలో బందరు డంపింగ్ యార్డులో సుమారు లక్ష టన్నులు పేరుకుపోయిందన్నారు. . అక్టోబర్ 2 వ తేదీన గాంధీ జయంతి రోజున ముఖ్యమంత్రిగారి పర్యటన సమయంలో చెత్త కొండను చూశాక రాష్ట్ర వ్యాప్తంగా ఇలానే ఉందని గుర్తించారన్నారు. . వీలైనంత త్వరగా రాష్ట్రంలోని చెత్త మొత్తాన్ని తొలగించాలని ఆదేశించారన్నారు. మచిలీపట్నంలోని డంపింగ్ యార్డు మొత్తాన్ని నెల రోజుల్లో శుభ్రం చేసి.. ఆ ప్రాంతంలో పార్కుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు .అదే సమయంలో ఎప్పటికప్పుడు సేకరించే చెత్తను శుభ్రం చేయడం కోసం 13 ఎకరాలు కేటాయించామన్నారు. అక్కడ ప్రాసెస్ చేసి గుంటూరులోని వేస్ట్ మేనేజ్ మెంట్ ప్లాంట్‌కి తరలించబోతున్నామన్నారు. 

జిల్లా పరిషత్ సమీపంలోని చెరువు వద్ద పార్కు అభివృద్ధికి రూ.2.72 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు.. టెండర్ల దశలో ఉందని త్వరలోనే పనులు ప్రారంభించి జూన్ జూలై నాటికి పార్కుగా తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. 1864లో ఏర్పడిన రెండో మున్సిపాలిటీగా బందరుకి పేరుందనీ. అలాంటి బందరుని అభివృద్ధి పథంలో నడిపించేలా సన్నాహాలు చేస్తున్నామన్నారు.. ప్రస్తుతం మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో 42వ స్థానంలో ఉంది. టాప్ 10లోకి తీసుకొచ్చేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. . 2014-19 మధ్య మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించగా, రూ.20 కోట్లు ఖర్చు చేశామని తర్వాత ప్రభుత్వం మారి అభివృద్ధి పనులు పూర్తి చేయకపోవడంతో నిధులు మురిగిపోయాయన్నారు. . తాము అధికారంలోకి వచ్చిన మొదట్లో మురుగు నీరు మొత్తం రోడ్లపైకి చేరుతోందన్నారు. అనంతరం మళ్లీ డ్రైనేజీలను అభివృద్ధి చేశామన్నారు. జిల్లా కలెక్టర్ కృషితో 13 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని మురికి కాలువల మధ్య ఉన్న అంతరాలను కలుపుతున్నామన్నారు. మచిలీపట్నంలో అంతర్గత డ్రైనేజీ అభివృద్ధి కోసం రూ.75 కోట్లు కేటాయించామని, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ను ఆహ్వానించామని ఈ నెల 25 తేదీబిలోగా పనులు ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నామన్నారు. మరోవైపు ప్లాస్టిక్ నిర్వహణ విషయంలో జిల్లా కలెక్టర్ గారి చొరవ అభినంద నీయమన్నారు. చెరువు జట్టు చుట్టూ ఉన్న బడ్డీ కొట్టులను తొలగించామని ఆ సమయంలో స్థానిక నాయకులు అందరూ సంపూర్ణ సహకారం అందించాలని నిజంగా ఎటువంటి జీవనాధారం లేని బడ్డీ కొట్టు నిర్వాహకులకు రాబోయే రోజుల్లో నిర్మించే షాపింగ్ కాంప్లెక్స్ లో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధన దిశలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 10 సూత్రాలను రూపొందించిందని, అందులో స్వచ్ఛ ఆంధ్ర ఒక కార్యక్రమం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఈ నెల జలం జీవం... జలధార జల హారతి ఇతివృత్తంతో జల సంరక్షణ పనులు ముమ్మరంగా చేపడుతున్నామన్నారు. చెరువుల్లో చెత్తాచెదారాలు వేయరాదని, ఎలాంటి పరిస్థితుల్లోనూ కలుషితం కారాదని, చెరువు చుట్టూ పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనే ఉద్యోగులు చెత్తను తొలగించే సమయంలో కొన్ని ఇబ్బందులకు గురవుతుండడం గమనించి వంగి లేయకుండా నిలుచునే చెత్తను ఏరి వేసేందుకు వీలుగా ఒక పట్టకార లాంటి పరికరాన్ని రూపొందించామని దానికి స్వచ్ఛ ఆయుధం పేరు పెట్టామన్నారు. నగరంలో చెత్త పేరుకొనీ ఉండే ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్ గా గుర్తించామని అక్కడ చెత్తంతా తొలగించి గ్రీన్ స్పాట్స్ గా రూపొందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. తొలుత నగరంలోని రామానాయుడుపేట..... విశాల్ మార్ట్ వీధిలో స్థానిక పాస్ట్ ఫుడ్ సెంటర్ వారి సహకారంతో గ్రీన్ స్పాట్గా మార్పు చేశామన్నారు.  అదే స్ఫూర్తితో నగరంలోని ప్రజలందరూ ముందుకు రావాలని ఇంకా చాలా చోట్ల గ్రీన్ స్పాట్స్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు.

ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛత కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని, ప్రతి మూడవ శనివారం జరిగే స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా పాల్గొని నగరాన్ని పరిశుభ్రం గా ఉంచడానికి కృషి చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో డిఆర్వో చంద్రశేఖర రావు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బోలం నాగమణి, మచిలీపట్నం అర్బన్ బ్యాంక్ చైర్మన్ దిలీప్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచే నాని, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, సహాయ కమిషనర్ గోపాలరావు, జడ్పీ డిప్యూటీ సీఈఓ ఆనంద్ కుమార్, బీసీ సంక్షేమ సాధికారత అధికారి రమేష్, జిల్లా పశుసంవర్ధక అధికారి చిన్న నరసింహులు, డి సి ఓ చంద్రశేఖర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ , మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, స్థానిక నాయకులు గోపాల్, వెంకటస్వామి తదితర అధికారులు అనధికారులు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...