Skip to main content

జనసేన కార్యకర్త ఇంటిని కూల్చివేసిన అధికారులు

జనసేన వర్సెస్ తెలుగుదేశం
తెర వెనుక చక్రం తెప్పిన తెలుగుదేశం పార్టీ 6 వ డివిజన్ ఇంచార్జ్

మచిలీపట్నం :

జనసేన కార్యకర్తపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్. కొబ్బరి తోటకు చెందిన జనసేన పార్టీ కార్యకర్త శ్రీపతి వెంకటాచలం ఇంటికి అనుమతులు లేవంటూ బుధవారం నగరపాలక సంస్థ అధికారులు కొంతమేర స్లాబ్ ను కూల్చివేశారు. తెలుగుదేశం పార్టీ 6 వ వార్డ్ ఇంచార్జ్ కక్ష సాధింపుల వల్ల ఇంటిని కూల్చి వేశారని బాధితులు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటి యజమాని వద్దకు వచ్చి తనకు గజానికి 5000 ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు బాధితులు ఆరోపించారు.

ఇంటి అక్రమ కూల్చివేతను ఆపాలని, ఇంచార్జ్ ఆగడాలను మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి స్పందన లేదని యజమాని వెంకటాచలం ఆవేదన వ్యక్తం చేశారు. ఇంచార్జ్ కక్ష సాధింపుతోనే ఇంటిని కూల్చి వేస్తున్నారని వెంకటాచలం భార్య పెట్రోల్ తో ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఇంచార్జ్ వసూలు పర్వంను భరించలేమంటు బాధితులు తమ బాధను మీడియాకి వెళ్ళబుచ్చారు. నగరపాలక సంస్థ అనుమతులు ఉన్నప్పటికీ మున్సిపాలిటీ అధికారులు అన్యాయంగా ఇల్లు కూల్చివేశారని కన్నీటి పర్యంతమయ్యారు.

 ఇంటి కూల్చి వేతను ఆపాలని అధికారులను ప్రాధేయపడ్డ ఆపలేదన్నారు. ఇంటిని అక్రమంగా కూల్చివేయడం పై నిరాహారదీక్షకు దిగనున్న కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి తీరును జనసేన పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు దుయ్యబట్టారు. ఈ సంఘటన జరిగిన సమయంలో పెద్ద ఎత్తున కొబ్బరి తోటకు చెందిన స్థానికులు ఘటన స్థలానికి చేరుకున్నారు . అయితే అక్రమ నిర్మాణం జరిగిందన్న ఆరోపణతో భవనం కొంతమేర స్లాబ్ ను నగరపాలక సంస్థ అధికారులు పోలీసు బలగాల సహాయంతో దగ్గరుండి మరి కూల్చివేశారు. ఈ కూల్చివేత ప్రక్రియ సాయంత్రం 5 గంటల నుండి 8:30 గంటల వరకు కొనసాగింది.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...