Skip to main content

'స్వచ్ఛాయుధం’ – ‘స్వచ్ఛ యోధులు’తో ప్లాస్టిక్ రహిత నగర నిర్మాణానికి శ్రీకారం –– జిల్లా కలెక్టర్

మచిలీపట్నం: 

మచిలీపట్నం నగరాన్ని ప్లాస్టిక్ వ్యర్థాల రహితంగా, శుభ్రంగా, పచ్చదనంతో నింపిన ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రజలు తమ వంతు సహకారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు జిల్లా కలెక్టర్ శుక్రవారం వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. నగరంలోని రహదారులు భవనాలు శాఖ అతిథి గృహం సమీపంలోని ఎన్జీఓస్ కాలనీలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా పాల్గొని, 'స్వచ్ఛాయుధం' అనే సాధనం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన, పచ్చదనంతో నిండిన నగరాన్ని నిర్మించగలమని అన్నారు. మచిలీపట్నం నగరాన్ని ప్లాస్టిక్ వ్యర్థాల రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాలను సులభంగా ఏరేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ఒక సాధనాన్ని పరిచయం చేశారు. కింద భాగంలో చిన్న మేకు అమర్చిన కర్రను స్వచ్ఛాయుధంగా పిలుస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా రోడ్లు, వీధులు, ప్రజా ప్రదేశాల్లో పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను సులభంగా సేకరించవచ్చని పేర్కొన్నారు.

అలాగే, తమ ప్రాంతంలో ప్రతిరోజూ 15 నుంచి 30 నిమిషాల పాటు ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారిని ‘స్వచ్ఛ యోధులు’గా గుర్తించనున్నట్లు తెలిపారు. సమాజం కోసం సేవా దృక్పథంతో ముందుకు వచ్చే యువత, మహిళలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సేవకులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు.
ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం మచిలీపట్నంలో ప్లాస్టిక్ లిట్టరింగ్‌ను తగ్గించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, అలాగే మున్సిపల్ సిబ్బంది డ్రైన్ క్లీనింగ్, కమర్షియల్ శానిటేషన్ వంటి ఇతర కీలక పనులపై మరింత సమయం కేటాయించేలా చేయడం అని జిల్లా కలెక్టర్ వివరించారు. ప్రజల సహకారంతో నగరాన్ని అందరూ గర్వించేలా క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దవచ్చని ఆయన అన్నారు. “మన నగరం – మన బాధ్యత” అనే భావనతో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆసక్తి గల వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ పేర్లను నమోదు చేసుకుని ‘స్వచ్ఛ యోధులు’గా సేవలు అందించాలని ఈ సందర్భంగా కోరారు.

కార్యక్రమంలో నగర కమిషనర్ బాపిరాజు, సహాయ కమిషనర్ గోపాలరావు, ఎన్నారై డాక్టర్ వడ్లమూడి రాజేంద్ర, మానవత స్వచ్ఛంద సేవా సంస్థ రాష్ట్ర కన్వీనర్ పి శ్రీరామ్, మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...