మచిలీపట్నం :
మచిలీపట్నం లేడీ యాంప్తిల్ పాఠశాలలో ప్రశాంత వాతావరణంలో పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతోంది. రెండవ రోజు జరుగుతున్న పదవ తరగతి పరీక్షా మూల్యాంకన కార్యక్రమాన్ని పరిశీలించేందుకు స్పాట్ కేంద్రాన్ని ఆర్జేడీ నాగమణి సందర్శించారు.
ఈ సందర్భంగా ఆమె మూల్యాంకన ప్రక్రియను సమగ్రంగా పరిశీలించారు. మూల్యాంకనం పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ఉపాధ్యాయులు బాధ్యతతో విధులు నిర్వర్తించాలని ఆమె సూచించారు. కేంద్రంలో ఉన్న సదుపాయాలను పరిశీలించి అవసరమైన సూచనలు కూడా అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి యువి సుబ్బారావు , ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Post a Comment