మచిలీపట్నం :
నగరంలో ఈ మధ్య దొంగతనాల జోరు పెరిగింది. తాజాగా మచిలీపట్నం సర్కార్ తోట రామాలయం వీధిలో చోరీ జరిగింది. ముఖ్యంగా తాళం వేసిన ఇళ్లనే దొంగలు టార్గెట్ చేస్తున్నారు.
పామర్తి వెంకట జయలక్ష్మి విజయవాడకు వెళ్ళిన సమయంలో దొంగలు ఆమె ఇంట్లో చోరీ చేశారు. పోలీసు వారు కూడా ఏదైనా ఊరు వెళ్తే సమీప పోలీస్ స్టేషన్లో వివరాలు తెలియజేయండి అని నగర ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. జయలక్ష్మి ఇంట్లో 40 వేల రూపాయల నగదు రెండు బంగారు గాజులు, ఉంగరం, లక్ష్మీదేవి రూపులు దొంగలు చోరీ చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సహాయంతో దొంగల్ని అతి త్వరలో పట్టుకుంటామని బందరు డిఎస్పి ధర్మేంద్ర తెలిపారు. యజమానులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, వీధి కమిటీలు ఏర్పాటు చేసుకొని దొంగల నిరోధానికి నగర పౌరులు సహకరించాలని అన్నారు.
Comments
Post a Comment