‘జలధార – నీటి భద్రత’ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పంటకాలువల పూడికతీత పనులన ప్రారంభించిన మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్
పెనమలూరు:
పెనమలూరు నియోజకవర్గం, ఉయ్యూరు మండలం, గండిగుంట మూర్తిరాజుగూడెం ప్రాంతంలో ‘జలధార – నీటి భద్రత’ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పంటకాలువల పూడికతీత పనులను పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తో కలిసి మాజీ మంత్రి కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాబోయే ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని నీటి నిల్వల సామర్థ్యాన్ని పెంపొందిస్తూ రైతులకు సమృద్ధిగా నీటి భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ప్రారంభించారని తెలిపారు. 100 రోజుల ప్రణాళిక వ్యవసాయ రంగానికి ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు మరియు అధికారులు పాల్గొన్నారు.
Comments
Post a Comment