Skip to main content

మచిలీపట్నం రూరల్ మండలంలో రెండో రోజు మంత్రి కొల్లు రవీంద్ర గ్రామ సందర్శన

సమస్యలు లేని నియోజకవర్గంగా మచిలీపట్నాన్ని మార్చడం నా లక్ష్యం

గ్రామ గ్రామానా సమస్యలు తెలుసుకుని అక్కడే పరిష్కరించేలా చర్యలు

అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి గ్రామ సందర్శన, ప్రజా దర్బార్

మచిలీపట్నం నియోజకవర్గం వాడపాలెం గ్రామ పంచాయతీలో పర్యటించిన మంత్రి కొల్లు రవీంద్ర.

మచిలీపట్నం:

 ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కృషికి ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించినపుడే క్షేత్రస్థాయిలో రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మచిలీపట్నం నియోజకవర్గం వాడపాలెం గ్రామ పంచాయతీ వెంకటదుర్గాపాలెం, లక్ష్మీపురం గ్రామాల్లో పర్యటించారు. అధికారులు, ప్రజాప్రతినిథులతో కలిసి ప్రజా దర్బార్ నిర్వహించారు. రోడ్లపై డ్రైనేజీ పారడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. శానిటేషన్ విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. అదే సమయంలో గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించేలా చూడాలన్నారు. అనంతరం అంగస్వాడీని పరిశీలించారు. ప్రభుత్వ స్కూల్లో మద్యాహ్న భోజనం పథకాన్ని పరిశీలించారు. విద్యార్ధులకు మజ్జిగ పంపిణీ చేశారు.

 వాడపాలెం గ్రామంలో రూ.74 లక్షలతో రోడ్లు నిర్మించాం. నియోజకవర్గంలో రూ.30 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టాం. గ్రామాల అభివృద్ధికి పంచాయతీరాజ్ శాఖ ద్వారా అనేక అభివృద్ధి పనులు చేపట్టాం. కొత్తగా ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. కొత్తగా పింఛన్లు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రజల అవసరాలు తీర్చటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజల మద్దతు ఇదేవిధంగా కొనసాగాలని కోరుకుంటున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీలు మున్సిపాలిటీలు అన్నింటా కూటమి విజయం సాధించాలి. 

  రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి సత్ఫలితాలు ఇస్తున్నాయి 2024 ఎన్నికల్లో 94 శాతం సీట్లతో విజయం సాధించాం. ఇది ప్రజా విజయం. ఇంతగా నమ్మిన ప్రజలకు మరింత మేలు చేయాలనే తపనతోనే రాష్ట్ర ప్రభుత్వం నిత్యం పనిచేస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. సూపర్ సిక్స్ హామీలను సాకారం చేసి చూపించాం. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.4000 పెన్షన్ ఇస్తున్నాం. తల్లికి వందనం, ఆటో డ్రైవర్లకు ఆర్ధిక సాయం, ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలను అమలు చేస్తున్నాం. 

 మరోవైపు అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చి.. పరిశ్రమలను ఏపీకి రప్పిస్తున్నాం. గత ఐదేళ్లు ఏపీలో పెట్టుబడి పెట్టాలంటేనే భయపడే పరిస్థితి ఉంటే నేడు పారిశ్రామిక వేత్తలు నమ్మకంగా ఏపీకి వస్తున్నారు. రాష్ట్రంలో సుస్థిరమైన పాలన ఉన్నపుడు మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుంది. రాష్ట్రంలో మరో పాతికేళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలనే లక్ష్యంతో 27 పాలసీలు తీసుకొచ్చాం. గత ప్రభుత్వ హయాంలో ఏపీకి వచ్చిన పెట్టుబడులు వెళ్లిపోగా, నేడు నమ్మకంతో ముందుకొస్తున్నారు. అందుకు నిదర్శనమే గూగుల్, అర్సెలార్ మిట్టల్ లాంటి పరిశ్రమలు. ఈ మధ్యనే అర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ పనులకు శ్రీకారం చుట్టాం. త్వరలోనే గూగుల్ సంస్థకు కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. 

 ప్రస్తుతం రాష్ట్రానికి వచ్చే ఆదాయం మొత్తం అప్పులు, వడ్డీలకే సరిపోతోంది. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ఆదాయం పెంచుకోవాలి. అందుకే పరిశ్రమలు తీసుకొస్తున్నాం. పెట్టుబడులు రప్పిస్తున్నాం.
గతంలో మూడు రాజధానులు అన్నారు. తర్వాత అమరావతే రాజధాని అన్నాడు. ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. ఇలాంటి దుర్మార్గుల కారణంగా రాష్ట్రం దెబ్బతినకూడదనే లక్ష్యంతో అమరావతే రాజధాని అని ప్రకటించి తీర్మానం చేశాం. పార్లమెంటులో తీర్మానం చేస్తే దేశంలోని అన్ని పార్టీలు మద్దతిచ్చాయి. కానీ జగన్ రెడ్డి మాత్రం మద్దతు ఇవ్వకపోగా పార్లమెంటు నుండి పారిపోయారు. గత ఐదేళ్లు అమరావతి రైతులు, మహిళలు చేసిన పోరాటం ఫలితంగానే ఇంత ఠీవీగా నిలబడుతోందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కార్యక్రమంలో కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యన్నారాయణ , రూరల్ మండలాధ్యక్షులు కాగిత వెంకటేశ్వరరావు , తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...