Skip to main content

మీకోసం అర్జీలకు అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలి.... జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ.

మచిలీపట్నం :

ప్రజల నుండి స్వీకరిస్తున్న మీకోసం అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. 

సోమవారం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిఆర్ఓ చంద్రశేఖర రావు, విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ పోతురాజు, సర్వ శిక్ష ఏపీసీ కుమిదిని సింగ్, డిఎస్పి శ్రీనివాసరావులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక.... మీ కోసం కార్యక్రమం నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. 

జిల్లా కలెక్టర్ అర్జీదారుల సమస్యలను ఎంతో ఓపికగా ఆలకించి సంబంధిత అధికారులను పిలిపించి సత్వరమే పరిష్కరించాలని సూచించారు. 

ఆ ప్రకారం కలెక్టరేట్లో మొత్తం 132 అర్జీలు జిల్లా యంత్రాంగం స్వీకరించింది. అందులో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి: 

మచిలీపట్నం నగరానికి చెందిన మహమ్మద్ బర్కతుల్లా అర్జీ అందజేస్తూ తన సతీమణి షకీలా పేరు మీద టిడ్కో ఇళ్ల ఫ్లాటు 4 వ అంతస్తులో ఇచ్చారని, ఆమె ఎక్కడానికి దిగడానికి చాలా ఇబ్బంది పడుతున్నట్లు తెలియజేస్తూ కింది అంతస్తులో ప్లాటు కేటాయించవలసినదిగా కోరారు.

మచిలీపట్నం చిలకలపూడి కి చెందిన కల్లేపల్లి సీతామహాలక్ష్మి తన ఎదురింటి వారు అయిన తిరువూరు లంక రామశాస్త్రి తన ఇంటికి కట్టుకున్న ప్రహరీని జరిపి కడతానని, తన అంతు చూస్తానాని బెదిరిస్తున్నారని, తమ ఇంటి ముందు ఉన్న పోరంబోకు స్థలమును కబ్జా చేయడానికి సిద్ధమవుతున్నాడని ఫిర్యాదు చేస్తూ పోరంబోకు స్థలాన్ని కబ్జా చేయకుండా కాపాడమని, తనను బెదిరించకుండా న్యాయము చేయాలని కోరుతూ అర్జీ అందజేశారు.

గత సంవత్సరంలో సంభవించిన మొంతా తుఫాను నష్టపరిహారాన్ని ఈరోజు వరకు సంబంధిత రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయలేదని, అకాల భారీ వర్షాలు కురిసి వరద నీరు మైనరు, మేజరు మురికి కాలువలలో పూడిక స్తంభించిపోయి పంట పొలాల్లో కి ప్రవహించి ముంపుకు గురవుతున్నాయని, నీటిలో మునగటం వలన పంట నష్టం జరుగుతుందనీ,, ప్రభుత్వంతో మాట్లాడి ఈ ఏప్రిల్, మే నెల ఆఖరి లోపల పూడికలను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని , కోడూరు, పాలకాయ తిప్ప ప్రాంతంలోని కరకట్ట వద్ద కొన్ని సంవత్సరాలుగా పనిచేయునటువంటి రెండు స్లూయిస్ లను వెంటనే మరమ్మతులు చేయించి 5 వేల ఎకరాలను ముంపు బారి నుంచి కాపాడాయులని, 22 - ఏ లో షరతులు గల పట్టా భూములు సుమారు 10 వేల ఎకరాలు నిషేధిత జాబితా నుండి తొలగించాలని కోరుతూ కృష్ణా జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరరావు, సభ్యులు ఆకుల బసవయ్య, ఉల్లీ శేషగిరిరావు తదితరులు అర్జీ అందజేశారు.

అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్షిస్తూ మీకోసం అర్జీలపై కొంతమంది అధికారులు సరైన ఎండార్స్మెంట్ ఇచ్చినప్పటికీ ఆన్లైన్లో ఎంపిక చేసే ఐచ్చికం సరిగా లేకపోవడంతో సమస్య వస్తుందని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వారిలో మార్పు రాకపోవడం సరైనది కాదన్నారు. ఇకనైనా పనితీరు సరి చేసుకోకపోతే షోకాజ్ నోటీస్ జారీ చేస్తామని హెచ్చరించారు. 

ఈనెల 17వ తేదీన రాష్ట్ర ఎస్. సి.కమిషన్ జిల్లాకు రానుందని రిజర్వేషన్ నియమ నిబంధనలు వారు చర్చిస్తారని కొంతమంది అర్జీలు కూడా ఇచ్చే అవకాశం ఉందని, అధికారులు వారి పరిధిలో ఇదివరకే ఏమైనా సమస్యలు ఉంటే వాటికి సంబంధించి పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని, సంబంధిత నివేదికలు ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారికి వెంటనే పంపించాలన్నారు.

అన్ని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలను చెత్తరహిత ప్రదేశాలుగా తీర్చిదిద్దాలన్నారు. 
వాటిల్లో ఇంకుడు గుంతలు, కాంపోస్టు గుంతలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. 

జిల్లాలోని అన్ని మంచినీటి జలాశయాలను 15 రోజులకు ఒకసారి బ్లీచింగ్ తో పరిశుభ్రం చేయాలన్నారు. 
సంబంధిత రిజిస్టర్ లో చుట్టుపక్కల నివసించే వారి చేత సంతకం తీసుకోవాలన్నారు. అధికారులు తరచూ తనిఖీలు చేసి రిజిస్టర్ను పరిశీలించాలన్నారు. ఆ విధంగా చేయడం వలన మంచినీరు కలుషితం కాకుండా ప్రజలు ఆరోగ్యంగా జీవిస్తానన్నారు. 
ప్రతి ప్రభుత్వ అధికారి వారికి కేటాయించిన విధులను సజావుగా నిర్వహించాలన్నారు 
జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు 

ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వం నిర్ణయించిన రుసుము కాకుండా ఇతరత్రా డబ్బు ఎవరైనా అడిగితే వెంటనే 90631 51600 నంబరుకు వాట్సప్ సందేశం పంపాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.

అన్ని మండల ప్రత్యేక అధికారులు వచ్చే శనివారం క్షేత్రస్థాయిలో పర్యటించి స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం పర్యవేక్షించడంతోపాటు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు విద్యాసంస్థలు సందర్శించి అక్కడ కంపోస్ట్ గుంతలు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశారా లేదా గమనించాలన్నారు .అలాగే మంచినీటి పరీక్ష పరికరాలను ఇవ్వడం జరిగిందని వాటిని వాడుతున్నారా లేదా కూడా పరిశీలించాలన్నారు. 

సమాచార హక్కు చట్టం సంబంధించి దరఖాస్తులు స్వీకరించడం కానీ సమాధానాలు పంపడం గాని ఆన్లైన్లో చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో మొత్తం 62 ప్రభుత్వ శాఖలకు గాను కొన్ని ప్రభుత్వ శాఖలు మాత్రమే పూర్తిస్థాయిలో ఆన్లైన్లో లాగిన్లు సిద్ధం చేశారన్నారు. మిగిలిన అధికారులు కూడా వెంటనే ప్రత్యేక శ్రద్ధ వహించి లాగిన్లు పూర్తి చేయాలన్నారు 

మీకోసం అర్జీలను పరిష్కరించడంలో అత్యంత ప్రతిభ కనబరిచిన 10 మంది అధికారులను గుర్తించి జిల్లా కలెక్టర్ వారిని అభినందిస్తూ బహుమతులను అందజేశారు. 
అందులో ఉంగుటూరు, బాపులపాడు, మొవ్వ, ఉయ్యూరు తహసీల్దారులు, వైఎస్ఆర్ తాడిగడప మున్సిపల్ కమిషనర్, ఉంగుటూరు ఎంపీడీవో, గన్నవరం ఎస్డిపిఓ,, అవనిగడ్డ పంచాయతీరాజ్ డీఈఈ, పౌరసరఫరాల సంస్థ డిఎం, పామర్రు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ సంక్షేమ వసతి గృహాల కోసం మంచినీటి పరీక్ష పరికరాలను జిల్లా ఎస్సీ సంక్షేమ అధికార అధికారి షాహిద్ బాబుకు, డి టి డబ్ల్యూ ధూర్జటి ఫణికి పంపిణీ చేశారు

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో ఆనంద్ కుమార్, డ్వామా, డి ఆర్ డి ఏ. పి డి లు శివ ప్రసాద్, హరిహరనాథ్, పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈలు సోమశేఖర్, రమణ రావు డీఎస్ఓ మోహన్ బాబు, జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి షాహిద్ బాబు, డిటిడబ్ల్యు ధూర్జటి ఫణి, గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి వెంకటరావు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...