Skip to main content

రైతు సంక్షేమమే కేడీసీసీ బ్యాంకు లక్ష్యం: కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం శ్రీ రఘురాం

లాభాల బాటలో కేడీసీసీ బ్యాంక్
చాట్రాయి తోట్లవల్లూరు కాటూరు కేడీసీసీ బ్యాంకు బ్రాంచ్ లలో 100% వసూళ్లు

మచిలీపట్నం :

కృష్ణా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్(కెడిసిసి)బ్యాంక్ లిమిటెడ్ లాభాల బాటలో పయనిస్తూ రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచిందని కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం శ్రీ రఘురాం అన్నారు. గురువారం కేడీసీసీ బ్యాంకు కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు, సన్న కారు రైతుల సంక్షేమమే తమ బ్యాంకు లక్ష్యం అన్నారు.

2025- 26 సంవత్సరం బ్యాంకు అభివృద్ధిపై ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను బ్యాంకు చైర్మన్ గా కేడీసీసీ బ్యాంకుకు వచ్చి సంవత్సరం అవుతున్నట్లుగా తెలియజేశారు. బ్యాంకు సీఈఓ, సిబ్బంది బ్యాంకు అభివృద్ధిలో తనకు అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. బ్యాంకు షేర్ క్యాపిటల్ 453.94 కోట్లు, రిజర్వ్ ఫండ్ 443.95 కోట్లతో 2025-26 సంవత్సరం సొంత నిధులు మొత్తం 897.88 కోట్ల అభివృద్ధికి చేరాయని అన్నారు. అభివృద్ధి బాటలో కేడీసీసీ బ్యాంకు పని చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయిలో తాము ప్రథమ స్థానంలో నిలిచామని సగర్వంగా తెలిపారు. సొంత నిధుల గ్రోత్ గతంలో కన్నా 12.2% కి వృద్ధి చెందిందన్నారు.

మొత్తం బ్యాంకు డిపాజిట్స్ 3,850.76 కోట్లు, లోన్లు అడ్వాన్సులు 8618.63 కోట్లు తో మొత్తం బ్యాంకు వ్యాపారం 12,469.39 కోట్లకు చేరిందన్నారు. గతంలో కన్నా 7.17% వృద్ధి నమోదు తో బ్యాంకు ముందంజలో ఉండటం గర్వకారణంగా ఉందన్నారు. బారోయింగ్స్ 6646.38 కోట్లతో గతంలో కన్నా 1.54 శాతం అభివృద్ధి వైపు పయనిస్తోంద న్నారు. ఇన్వెస్ట్మెంట్లు 200863.13 కోట్లకు చేరిందని, 13. 36% అభివృద్ధిలో సాగుతోందన్నారు. తీసుకున్న వడ్డీలు 948.17 కోట్లకు చేరి 4.76% వృద్ధిలో పయనిస్తోందన్నారు. 
మిస్లీనియస్ ఇన్కమ్ 19.48 కోట్లు గా ఉందన్నారు. బ్యాంక్ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్ 91.26 కోట్లుగా ఉందన్నారు. బ్యాంక్ ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ 52.78 కోట్లు, ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ 105.99 కోట్లకు చేరి, 4.88% వృద్ధిరేటు నమోదు చేసుకుందన్నారు. 

ఉమ్మడి కృష్ణాజిల్లాలో చాట్రాయి, తోట్లవల్లూరు, కాటూరు బ్యాంకు శాఖలలో 100% వసూళ్లు సాధించడం పట్ల సిబ్బందిని అభినందించారు. రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి తిరిగి వారం రోజుల్లో మళ్ళీ వెంటనే ఋణం పొందవచ్చన్నారు. రైతులు పంట రుణమాఫీ కింద జూన్ 30 లోపు క్లైమ్ పెట్టుకోవాలని అన్నారు. రైతు సంక్షేమమే తమ బ్యాంకు లక్ష్యమని, సన్న, చిన్న కారు రైతులకు, చిరు వ్యాపారులకు తమ బ్యాంకు ఎల్లవేళలా అండదండలు అందిస్తుందని చైర్మన్ నెట్టెం శ్రీ రఘురాం అన్నారు. చనిపోయిన రైతులకు డెత్ లైన్లు సకాలంలో అందిస్తామన్నారు. అయితే సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి జీవిత బీమా కూడా అమలు చేస్తామని తెలిపారు. చిన్న, సన్నకారు రైతులు ఎవరైనా అనారోగ్య కారణాల వల్ల గాని మరే ఇతర కారణాల వల్ల గాని, వృద్ధాప్యం వల్ల గాని మరణిస్తే వారి కుటుంబానికి మట్టి ఖర్చులు నిమిత్తం పదివేల రూపాయలు దహన సంస్కారాల ఖర్చులను కూడా అందజేస్తామన్నారు.
రైతులు తమ ఇన్సూరెన్స్ పాలసీని ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకోవాలని తెలిపారు.

ఈ సందర్భంగా బ్యాంకు సంక్షేమం, అభివృద్ధి కి చిత్తశుద్ధితో పాటుపడిన ఉద్యోగులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. తమ హయాంలో కేడీసీసీ బ్యాంకును లాభాల బాటలో పయనింప చేస్తున్నామని అన్నారు. డిపాజిట్ల సేకరణలో కూడా బ్యాంకు అగ్రభాగాన నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు సీఈవో శ్యామ్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...