మచిలీపట్నం :
సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందాలని వాకర్స్ ఇంటర్నేషనల్ 204 జిల్లా డిప్యూటీ గవర్నర్ కారుమూరి రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆదివారం పరాసుపేట నిట్ సెంటర్లో మచిలీపట్నం డివిజన్ వాకర్స్ క్లబ్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ నడక వలన లాభాలు తెలియజేస్తూ అందరిని నడిపించడానికి కృషి చేయాలన్నారు.
వేసవిలో మజ్జిగ పంపిణీ, పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత తదితర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి దగ్గర కావాలన్నారు. వాకర్స్ క్లబ్బులను బలోపేతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న డా. భోగరాజు పట్టాభి సీతారామయ్య వాకర్స్ క్లబ్ అధ్యక్షులుగా బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పివి ఫణి కుమార్, కార్యదర్శిగా ప్రముఖ ఇంజనీర్ ఆర్ వి ఎస్ మురళీధర్, కోశాధికారిగా కలం కౌంటర్ వ్యవస్థాపకులు సిహెచ్ రవికుమార్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జోన్ ఛైర్ పర్సన్ లు జల్దు మురళీనాథ్, లంకిశెట్టి నీరజ, సీనియర్ వాకర్ నిట్ కంప్యూటర్స్ అధినేత కంతేటి శివరావు, వివిధ క్లబ్బుల అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు పాల్గొన్నారు.
Comments
Post a Comment