Skip to main content

ఎండల విషయంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.!: జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎం నవీన్

మచిలీపట్నం :

ప్రస్తుతం జిల్లాలోఎండలు ఎక్కువగా ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయట తిరగరాదని తగినన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఎం నవీన్ పిలుపునిచ్చారు. 

గురువారం ఉదయం నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయం ముంగిట శ్రీ సత్య సాయి సేవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని జిల్లా ఇన్చార్జి కలెక్టర్, అదనపు ఎస్పీ సత్యనారాయణతో కలిసి ప్రారంభించి ప్రజలకు, మంచినీరు మజ్జిగ పంపిణీ చేశారు.
జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ఎండ వేడిమి ఎక్కువగా ఉండడంతో ప్రజల సౌకర్యం కోసం శ్రీ సత్య సాయి సేవ సమితి చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. చలివేంద్రంలో మంచినీటితో పాటు మజ్జిగ కూడా పంపిణీ చేయడం చాలా సంతోషదాయకమన్నారు. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఎవరూ కూడా అత్యవసరమైతే తప్ప బయట తిరగరాదని, తెల్లని వస్త్రాలు, తలకు టోపీ గాని తలపాగా గాని ధరించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు. 

ప్రజలు మంచినీరు, మజ్జిగ , కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగాలని, శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకుంటూ ఆరోగ్యం కాపాడుకోవాలన్నారు. 
అదనపు ఎస్పి సత్యనారాయణ మాట్లాడుతూ సత్య సాయి సేవ సమితి చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకమన్నారు. సమితి వారు ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం, కలెక్టర్ వారి కార్యాలయంలో జరిగే మీకోసం కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చే ప్రజలకు స్వచ్ఛందంగా అల్పాహారము మంచినీరు అందజేసి ఎంతగానో తోడ్పాటు అందిస్తున్నారన్నారు. అలాగే ప్రతి సంవత్సరము సమితి వారు చలివేంద్రం ఏర్పాటు చేసి చాలా పద్ధతి ప్రకారం నడుపుతూ ప్రజలందరికీ మంచినీటి సౌకర్యం అందుబాటులో ఉంచుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. 

మునిసిపల్ సహాయ కమిషనర్ గోపాలరావు, సత్యసాయి సమితి సేవా సమితి జిల్లా అధ్యక్షులు కొమరగిరి చంద్రశేఖర్, కన్వీనర్ పోతుకూచి ఆంజనేయ కుమార్, సహ కన్వీనర్ ఆనుమకొండ వెంకటేశ్వరరావు పలువురు పోలీసులు, సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...