Skip to main content

రాజకీయాల కోసం అభివృద్ధిని అడ్డుకుంటే ఉపేక్షించం


- పోర్టు రోడ్డులో అభివృద్ధి పనులపై వైసీపీ రాద్దాంతం సిగ్గుచేటు
- డ్రైనేజీ సమస్య పరిష్కారం లక్ష్యంగా పనిచేస్తుంటే విమర్శలా?
- ఎవరెన్ని కుట్రలు చేసినా బందరుని అభివృద్ధి చేసి చూపిస్తా
- పేర్ని కిట్టుపై మంత్రి కొల్లు రవీంద్ర పరోక్ష విమర్శలు
- మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో మంత్రి కొల్లు రవీంద్ర.
మచిలీపట్నం :

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ జవాబుదారీగా ఉండాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పని చేస్తోందని, ప్రతి నియోజకవర్గంలో శాసనసభ్యులు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నారని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. కొన్ని దరఖాస్తుల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలిచ్చారు. మచిలీపట్నంలో 409 అర్జీలు వచ్చాయి. శాఖల అధికారులకు పంపించి పరిష్కరించాం. 57 దరఖాస్తులు మాత్రమే పెండింగులో ఉన్నాయి. ముఖ్యంగా పెన్షన్లు, ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులు అధికంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మేలో జాబ్ మేళా నిర్వహించేలా సన్నాహాలు చేస్తున్నాం. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ఎంఎస్ఎంఈ, ఫిషరీస్, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తాం. రిజిస్టర్ చేసుకున్నవారికి ఉద్యోగ అవకాశాలతో పాటు శిక్షణ కూడా అందించేలా చర్యలు తీసుకుంటాం. 
 నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రపథంలో నిలపాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పని చేస్తుంటే.. కొంత మంది రాజకీయం కోసం ఏదో ఒక రాద్దాంతం సృషించేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటు. బందరు అభివృద్ధిని అడ్డుకునేందుకు కూడా వెనుకాడకుండా వ్యవహరించడం దుర్మార్గం. పోర్టు రోడ్డులో ప్రధాన సమస్య మురుగు నీరు. అక్కడ గేదెలు ఎక్కువగా తిరుగుతుండడం, మురుగు పొలాల్లోకి వెళ్తుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ డ్రైనేజీ నీటి సమస్య పరిష్కారం కోసం రూ.50 కోట్ల వ్యయంతో రెండు ఎస్టీబీలు ఏర్పాటు చేస్తున్నాం. బందరు కోట నుండి పోర్టు రోడ్డు వైపు వెళ్లే మురుగు మొత్తాన్ని శుద్ధి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎంత పెద్ద వర్షం వచ్చినా మురుగు నీరు బందరులోకి రాకుండా చర్యలు తీసుకుంటే.. బందరు మునిగిపోతోందంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. అభివృద్ధి చేయడం చేతకాదు, నిధులు తీసుకురావడం చేతకాదు. ఎవరైనా అభివృద్ధి చేస్తుంటే విమర్శలు చేయడం. ప్రజలకు మంచి చేస్తుంటే అండగా నిలవాల్సింది పోయి దిక్కుమాలిన రాజకీయం చేస్తున్నారు.

మా తాత ముత్తాతల నుండి ఉన్న పొలాల కోసం నేడు ముంచేస్తున్నామంటూ సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి రైతులు, ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో బందరు మొత్తం మొక్కలు పెట్టిస్తే.. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మీటింగుల పేరుతో చెట్లు మొత్తం నరికేశారు. రోడ్లు మొత్తం అభివృద్ధి చేస్తున్నాం. 

కూటమి ప్రభుత్వానికి తెలిసిందంతా అభివృద్ధి చేయడమే. మీలా మాకు అభివృద్ధిని అడ్డుకోవడం, విధ్వంసం సృష్టించడం చేతకాదు. ఎన్ని విమర్శలు చేసినా, అధికారుల్ని బెదిరించినా, కులం పేరుతో కుట్రలకు పాల్పడినా.. మేం అభివృద్ధి వైపే అడుగులేస్తాం. అధికారుల్ని బెదిరించడం, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి రచ్చ చేయడం తప్ప పేర్ని ముఠా సాధించిందేంటి?

డ్రైనేజీని పూర్తి చేస్తాం. రోడ్ల పనులు చేస్తాం. పంచాయతీలకు రోడ్డు సదుపాయాలు కల్పిస్తాం. రూ.20 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపడతాం. పోలాటితిప్ప నుండి గరాలదిబ్బ రోడ్డు, నడమేరు-కొండేరు బ్రిడ్జికి రూ.18 కోట్లు మంజూరయ్యాయి. ఆ పనుల్ని కూడా ప్రారంభించుకుంటాం. మా లక్ష్యం బందరు నియోజకవర్గ అభివృద్ధి. ఇప్పటికే బందరులో పేదలకు జీ+3 ఇళ్లు నిర్మించి అందించాం. ప్రతి ఒక్కరికీ సొంతింటి కలను సాకారం చేసి చూపిస్తాం. ఇప్పటికే మచిలీపట్నంలోని శివారు ప్రాంతాలకు కూడా తాగునీరు అందించేలా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశాం. బందరు పోర్టును పూర్తి చేసి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా మారుస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యన్నారాయణ , మోటమర్రి బాబాప్రసాద్ , కాగిత వెంకటేశ్వరరావు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...