Skip to main content

మచిలీపట్నాన్ని ఆదర్శ నియోజకవర్గంగా మార్చి చూపిస్తా

- 34 పంచాయతీలు, 50 డివిజన్లలో పర్యటనకు శ్రీకారం
- గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు తెలుసుకోవడం లక్ష్యంగా పర్యటన
- సంక్షేమం, అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది
- పోతిరెడ్డిపాలెంలో గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం:

 సంక్షేమం, అభివృద్ధిలో మచిలీపట్నం నియోజకవర్గాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పని చేస్తున్నానని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బందరు నియోజకవర్గంలోని 34 గ్రామ పంచాయతీలు, 50 డివిజన్లలో ప్రతి రోజు పర్యటించేలా ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలి రోజు పోతిరెడ్డిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని పొట్లపాలెం, పిల్లారిశెట్టిపాలెం, పోతిరెడ్డిపాలెం, శ్రీనివాస నగర్లో పర్యటించారు. 

 గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. పిల్లలతో మమేకమై వారితో కాసేపు సరదాగా గడిపారు.గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రధానంగా నియోజకవర్గంలో తాగునీరు, రోడ్లు,డ్రైనేజీ సమస్యల గురించి తెలుసుకున్నారు. సెంటు పట్టాలో ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పడంతో అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వ్యవసాయ కాలువల్లో పూడిక తొలగించాలని, కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని విన్నవించడంతో అధికారులతో మాట్లాడి తక్షణమే పరిష్కరించాలని సూచించారు.

 అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మచిలీపట్నం నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి వార్డులో పర్యటించి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేలా ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గత ఐదు సంవత్సరాలు నియోజకవర్గంలో అభివృద్ధిని గాలికి వదిలేశారు. అందుకే క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేలా చిత్తశుద్ధితో పని చేస్తోంది. గ్రామాలను పచ్చగా మార్చడం ద్వారా మాత్రమే అసలైన అభివృద్ధి సాధ్యమవుతుంది. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. డ్రైనేజీలు, రోడ్ల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తాం. డ్రైనేజీ సమస్య లేకుండా చూసుకుంటాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం కేటాయించి ఇళ్లు నిర్మించి అందిస్తాం. ఇంటింటికీ తాగునీటి కుళాయి ఏర్పాటు చేస్తాం.

 రాష్ట్రానికి వచ్చే ఆదాయం మొత్తం జీతాలు, పెన్షన్లకే సరిపోతోంది. కేంద్రం నుండి వచ్చే నిధులు వడ్డీలు చెల్లించేందుకు పోతోంది. వృద్ధాప్య పెన్షన్ల కోసం ఏటా రూ.32 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. తల్లికి వందనం పథకానికి రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఉచిత గ్యాస్ కోసం రూ.2500 కోట్లు ఖర్చు అవుతోంది. ఉచిత బస్సు పథకం, అన్నదాత సుఖీభవ లాంటి అనేక పథకాలు పక్కాగా అమలు చేస్తున్నాం. జగన్ రెడ్డి రూ.3000 పెన్షన్ హామీని ఏటా పెంపు పేరుతో దగా చేస్తే.. కూటమి అధికారంలోకి రాగానే అమలు చేసింది. 

 గత ఐదు సంవత్సరాలు మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధిని గాలికి వదిలేశారు. కూటమి వచ్చాక చేయాలనుకున్నా అడ్డుకున్నారు. అందుకే భవిష్యత్తులో సమస్య అనేది లేకుండా సన్నాహాలు చేస్తున్నాం. ప్రధాన సమస్యల్ని దశల వారీగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ శాఖ నుండి అవసరమైన నిధులు తీసుకొస్తాం. ప్రధాన రోడ్లు మొత్తం పూర్తి చేశాం. డ్రైనేజీల పనులు పూర్తి చేస్తాం. ఇళ్ల స్థలాలు కూడా అందరికీ అందించి వాటిని పూర్తి చేస్తాం. మచిలీపట్నంలో తాగునీటి సమస్య తీరుస్తాం. సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల్ని వీలైనంత వరకు అభివృద్ధి చేస్తాం. ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ప్రతి గ్రామంలో పర్యటించి ప్రతి సమస్యనూ పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాను.

 సెంటు పట్టాలో ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బంది ఎదురవుతోందని చెప్పడంతో అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వ్యవసాయ కాలువల్లో పూడిక తొలగించాలని రైతులు కోరడంతో త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కొత్త పెన్షన్ల వినతులను కూడా పరిష్కరించాలన్నారు.  

 కార్యక్రమంలో గొర్రెపాటి గోపీచంద్ , గోపు సత్యన్నారాయణ , కుంచె దుర్గాప్రసాద్ , గంగాధర్ , మధు , ఆలపాటి రమేష్ , గ్రామ పార్టీ నాయకులు విష్ణు, శివ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...