Skip to main content

కపిలేశ్వరపురం జెడ్పీ ఉన్నత పాఠశాల అభివృద్ధికి కామినేని హాస్పిటల్స్ సేవలు ప్రశంసనీయం

రూ.2 కోట్ల అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా శంకుస్థాపన

పమిడిముక్కల: 

కపిలేశ్వరపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.2 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టిన కామినేని హాస్పిటల్స్ సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కొనియాడారు.

శనివారం పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో చేపట్టనున్న ప్రహరీ గోడ నిర్మాణం, నూతన భవన నిర్మాణం, స్థలం మెరక అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యేతో కలిసి పాఠశాల ఆట స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్, అక్కడ ఉన్న ఆక్రమణలను తొలగించి, స్థలాన్ని మెరక చేసి విద్యార్థులకు అనుకూలంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ‘పి-4’ పేరుతో ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోందని తెలిపారు. విద్య ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని, విద్యాభివృద్ధికి చేయూతనందిస్తున్న కామినేని హాస్పిటల్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. నిధులు సద్వినియోగం కావాలంటే మాతృభూమి శ్రేయోభి సంఘం వంటి మంచి టీమ్ అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థులు పదో తరగతిలో నూరు శాతం ఫలితాలు సాధించేలా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు.

విద్యార్థులు పరీక్షల్లో ఎలా విజయవంతం కావాలో కూడా జిల్లా కలెక్టర్ పలు మెలకువలు, సూచనలు అందించారు. అలాగే గ్రామంలో చదువులో వెనకబడిన విద్యార్థులను మాతృభూమి శ్రేయోభి సంఘం దత్తత తీసుకుని, వారిని అన్ని సబ్జెక్టుల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

పామర్రు శాసన సభ్యుడు వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తు దిశగా సుపరిపాలన అందిస్తోందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జిల్లా కలెక్టర్ ఋషిలా పనిచేస్తూ, జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపారని ప్రశంసించారు.

కార్యక్రమంలో డివైఈవో పద్మారాణి, ఎంఈఓ శ్రీనివాస్, హెచ్ఎం తులసి రాణి, కామినేని హాస్పిటల్స్ ప్రతినిధి గొంది శివరామకృష్ణ ప్రసాద్, మాతృభూమి శ్రేయోభి సంఘం అధ్యక్షుడు తాతినేని శేషగిరిరావు తహసీల్దార్ నవీన్ కుమార్, ఎంపీడీవో వీర్ల సీతారామరాజు, గ్రామ పెద్ద తాతినేని రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...