మచిలీపట్నం :
ఈ నెల 9,10 తేదీలలో ఉమ్మడి కృష్ణాజిల్లా విజయవాడలో కొనుగోలుదారులు... అమ్మకందారుల సమ్మేళనం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సజావుగా చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో స్వయం సహాయక సంఘాల మహిళ వ్యాపారవేత్తలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించే విషయమై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేస్తున్న వివిధ రకాల ఉత్పత్తులను మార్కెటింగ్ సౌకర్యం కల్పించే నిమిత్తం కొనుగోలుదారులు.. అమ్మకందారుల సమ్మేళనాన్ని ఈనెల 9, 10 తేదీలలో విజయవాడ గాంధీనగర్ లోని చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం అవసరమైన అన్ని రకాల ఏర్పాటు పూర్తి చేయాలన్నారు.
చాలామంది మహిళలకు పిఎం ఎఫ్ఎంఈ, పిఎంఈజీపి పథకాల ద్వారా బ్యాంకు రుణాల అందించడం జరిగిందన్నారు.
ఈ మేరకు ఒక ప్రోమో వీడియోను కూడా కలెక్టర్ విడుదల చేశారు. ఇందులో జిల్లాలోని హోల్సేల్, రిటైలర్లు అందరూ ఈనెల 9, 10 తేదీలలో విజయవాడలో నిర్వహించే కొనుగోలుదారులు అమ్మకందారుల సమ్మేళనంలో పాల్గొనాలన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళ వ్యాపారవేత్తలు ఎంతో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ తయారుచేసిన వస్తువులను పరిశీలించి ఆర్డర్లు ఇచ్చి మంచి మహిళ వ్యాపారవేత్తలుగా తయారయ్యేలా ప్రోత్సహించాలన్నారు. వారిచ్చే ఒక ఆర్డర్ మహిళా వ్యాపారవేత్తల జీవితాన్నే మార్చేయవచ్చన్నారు.
ఒక్కసారి వీలు చేసుకుని రావాలని ఉత్పత్తులు బాగుంటేనే నచ్చితేనే వాటికి ఆర్డర్లు ఇవ్వాలన్నారు.
గ్రామీణ మహిళా వ్యాపారవేత్తలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని కోరారు
ఈ సమావేశంలో డిఆర్డిఏ పిడి హరిహరనాథ్, డిఐసి జిఎం వెంకటరావు, ఉద్యాన అధికారి జె జ్యోతి, వాణిజ్య పన్నుల శాఖ సహాయ కమిషనర్ సౌమ్య, ఆహార తనిఖీ అధికారి గోపాలకృష్ణ, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ నిఖిల శ్రీ , ఏ డి ఐ ఓ సెల్వినా తదితర తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment