Skip to main content

మన చంద్రన్న - 2 పుస్తకం ఆవిష్కరణ

           చంద్రబాబు నాయుడు 2024 నుండి నేటి వరకు సాగిన పాలన, వివిధ సంక్షేమ పథకాల అమలు తీరుతున్నలపై అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం విజనరీ మన చంద్రన్న శీర్షికతో టి డి జనార్దన్ రచించిన మన చంద్రన్న - 2 పుస్తకం తొలి కాపీ ని ముఖ్యమంత్రి అందుకున్నారు.

         తొలుత సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను సీఎం నివాసంలో కలిసిన తెలుగుదేశం జాతీయ ఉపాధ్యక్షులు తొండెపు దశరథ జనార్దన్ ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసారు. 

         అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీ జనార్ధన్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో     తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు  మన చంద్రన్న - 2 పుస్తకాన్ని  ఆవిష్కరించారు. చంద్రబాబు  సంక్షేమ - అభివృద్ధి - సామాజిక న్యాయ కార్యక్రమాలను డిజిటలైజ్ చేయడం కోసం రూపొందించిన మన చంద్రన్న @mana-chandranna  యూట్యూబ్ ఛానెల్ ను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వర్ల రామయ్య  ప్రారంభించారు. 

         మన చంద్రన్న - 2 పుస్తక రచనలో క్రియాశీలకంగా వ్యవహరించిన అధికార భాషా సంఘం ఉపాధ్యక్షులు విక్రమ్ పూల, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ జాయింట్ సెక్రటరీ కాసరనేని రఘురామ్  హాజరైన ఈ కార్యక్రమంలో ఏ.పీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె కె చౌదరి, కమ్మ కార్పొరేషన్  బ్రహ్మం చౌదరి, గుంటూరు జిల్లా గ్రంధాలయ సంస్థ డైరెక్టర్ భీమనేని వందన దేవి, ఏపీ ఉమెన్స్ కో ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్ పర్సన్  పీతల సుజాత, ఏ.పీ.టీ.ఎస్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ,  నాటక అకాడమి చైర్మన్ గుమ్మడి గోపాల కృష్ణ, ఉండవల్లి శ్రీ దేవి, కంట్రోల్ బోర్డు చైర్మన్ పి కృష్ణయ్య, టీడీపీ నాలెడ్జి సెంటర్ హెడ్  మాల్యాద్రి, ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షుబ్లీ, ఏ.పీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మౌలానా షేక్ ముస్తాక్అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.

         గతంలో చంద్రబాబు జీవిత విశేషాలతో టీడీ జనార్ధన్ రచించిన మన చంద్రన్న పుస్తకం రికార్డు స్థాయిలో ముద్రితమైంది. ఈ పుస్తకం తెలుగుదేశం కార్యకర్తల శిక్షణలో పాఠ్య గ్రంథంగా ఉపయోగించ బడుతుంది. ఆ పుస్తకానికి కొనసాగింపుగా  మన చంద్రన్న - 2 పుస్తకాన్ని జనార్దన్ రచించారు.


 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...