Skip to main content

అక్రమంగా మడ అడవుల తవ్వకం పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన పేర్ని నాని

విలేఖరి ఉప్పందించడంతో పారిపోయిన అక్రమ తవ్వకందారులు

మచిలీపట్నం :

మచిలీపట్నం మండలంలో మడ అడవులు అక్రమ తవ్వకాలపై కృష్ణాజిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు పేర్ని వెంకట్రామయ్య (నాని) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పెదపట్నం, కానూరు ప్రాంతంలో మడ అడవులు తవ్వకాలపై సమాచారం అందుకున్న నాని హుటాహుటిన తవ్వకాల ప్రాంతానికి చేరుకున్నారు. అయితే ఇంతలో అక్రమ తవ్వకాదారులు తవ్వకాలను నిలిపివేసి అక్కడి నుంచి హుటా హుటిన పారిపోయారు. దీనిపై పేర్ని వెంకట్రామయ్య (నాని) జాయింట్ కలెక్టర్ నవీన్ కు తవ్వకాల పై ఫిర్యాదు చేశారు. అనంతరం పేర్ని విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఉన్న గ్రామస్థాయి నాయకులు ఎకరం సాగు చేస్తున్న రైతులను కమిషన్ల కోసం వేధిస్తున్నారు అని అన్నారు. మండలంలోని మడ అడవులను ధ్వంసం చేస్తున్నా ఆర్డీవో పట్టించుకోవడంలేదని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

మడ అడవులను తొలగిస్తున్న నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్న ఆర్డీవో తీరును ఘాటుగా పేర్ని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల కోసమే పని చేయాలన్నారు. మడ ప్రాంతంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేయగానే ఆయన వెంటనే స్పందించారని అన్నారు.

ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారు రైతులు చెప్పే సమస్యలను సావధానంగా ఆలకించి రైతులకు సహాయపడాలన్నారు. తాను జాయింట్ కలెక్టర్ కు సమస్యను చెప్పిన వెంటనే ఆయన స్పందించిన తీరును చూసి బందరు ఆర్డిఓ నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు.

విలేఖరి పై పేర్ని విమర్శ

బందరు మండలం కానూరు లో కూటమి ప్రభుత్వానికి చెందినవారు కొంతమంది మడ అడవులను తవ్వుతున్నారని దినపత్రిక విలేఖరి తనకు సమాచారం అందించారని, తవ్వకానికి పాల్పడుతున్న వారిని తక్షణమే పట్టుకోవాలని ఆ విలేఖరి తనకు వివరించారని పేర్ని మీడియాకు తెలిపారు. తాను స్వయంగా తన పార్టీకి చెందిన వారితో కానూరు కు వెళ్ళగా అప్పటికే సదర విలేఖరి కూటమి ప్రభుత్వానికి చెందిన వారికి - పేర్ని నాని ఆకస్మక తనిఖీకి వస్తున్నారని చెప్పి ఆ కూటమి నాయకులని అక్కడి నుండి పారిపోవాలని సమాచారం అందించి ద్వంద్వ వైఖరి అవలంబించాడని, విలేకరిని దుయ్యబట్టారు. ఆ విలేఖరి వల్ల తాము సురక్షితంగా ఉండగలిగామని కూటమికి చెందిన నాయకులు చెప్పడం విశేషం!!

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...