మచిలీపట్నం:
కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన బి.టెక్ - 1 సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ), బి.ఎడ్ & స్పెషల్ బి.ఎడ్ (BED & Spl.BED)-1 సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ), బి. ఫార్మసీ - II సెమిస్టర్ (రీ-వాల్యుయేషన్) ఫలితాలు మంగళవారం, 31 మార్చి 2026న విడుదల చేయబడినట్లు కృష్ణా విశ్వవిద్యాలయ ఉపకులపతి గౌరవనీయులు శ్రీ కూన రాంజీ, పరీక్షల నియంత్రణాధికారి డా. పి. వీర బ్రహ్మచారి తెలిపారు.
సంబంధిత విద్యార్ధులు తమ ఫలితాలను కృష్ణా విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ ద్వారా
పరిశీలించుకోవచ్చని వారు సూచించారు. పునఃమూల్యాంకనానికి దరఖాస్తు చేయదలచిన విద్యార్థులు 08-04- 2026 నుండి 09.04.2026 వరకు విశ్వవిద్యాలయ వెబ్సైట్లో సూచించిన రుసుమును చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పునఃమూల్యాంకనానికి సంబందించిన పూర్తి వివరాలు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ (www.kru.ac.in) లో పొందుపరిచినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పి. వీర బ్రహ్మచారి తెలిపారు.
Comments
Post a Comment