Skip to main content

జిల్లా అభివృద్ధిలో మహిళలది కీలక పాత్ర – జిల్లా కలెక్టర్


జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
మచిలీపట్నం, 8 మార్చి 2026, SSN:
         మహిళలు వివిధ రంగాలలో రాణిస్తూ జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ప్రభుత్వ సహకారాన్ని అందిపుచ్చుకుని మరింత అభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి కోరారు.
      మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో డ్వాక్రా సంఘాల మహిళలు, మహిళా వ్యాపారవేత్తలు, మహిళా ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొని వారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయా రంగాలలో విజయం సాధించిన మహిళలకు ప్రశంస పత్రాలు అందించి అభినందించారు. డ్వాక్రా సంఘాల మహిళలకు మెగా చెక్కుల పంపిణీ చేశారు.
         వెయిట్ లిఫ్టర్ శిరోమణి, కయాకింగ్ జల క్రీడాకారిణి నాగిడి గాయత్రి, జిల్లాలోని పామర్రు, గన్నవరం ప్రాంతాలకు చెందిన వ్యాపారవేత్తలు యశస్వి, సుష్మా , యోగా ఉపాధ్యాయురాలు రేవతి తదితర విజయవంతమైన మహిళలు తమ జీవితాల్లోని అనుభవాలను పంచుకుని మహిళల్లో స్పూర్తిని నింపారు.
        ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యాపారవేత్తగా ఎదగాలనే కోరిక, తపన కలిగి ఉండటం విజయానికి తొలిమెట్టు అని పేర్కొన్నారు. మహిళలు వ్యాపారవేత్తలుగా ఉంటే విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. మహిళలు వ్యాపారాలు చేస్తే పనిమీద వారికి ఎక్కువ ధ్యాస ఉంటుందని, ఓర్పు ఎక్కువ ఉండటం వల్ల వారు చేపట్టే పనిలో నాణ్యత ఉండి, ఫలితాలు గొప్పగా ఉంటాయని, నిలకడ తత్వం వంటి లక్షణాలు కలిగి ఉండటంతో వారు వ్యాపారంలో సులువుగా రాణిస్తారని అన్నారు. వారి నైపుణ్యాన్ని వస్తురూపంలోకి మార్చుకునే విధంగా కృషి చేయాలని, ఉత్పత్తులు విక్రయించుకునేందుకు మార్కెటింగ్ సౌకర్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. మీకోసం మీరు సమయం గడపాలని, కొత్త విషయాలు నేర్చుకోవాలని, పట్టుదల తపనతో కృషి చేస్తే విజయం తథ్యం అని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాజస్థాన్ కు చెందిన కల్పనా సరోజ్, ఉమాదేవి వంటి ప్రముఖ వ్యాపారవేత్తల విజయ గాధలను సోదాహరణంగా వివరిస్తూ మహిళలలో స్ఫూర్తిని నింపారు.
         జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో దూసుకుపోతూ, ఆర్థిక స్వాతంత్ర్యం పొందుతూ సాధికారత సాధిస్తున్నారన్నారు. అదే సమయంలో, సైబర్ నేరాలు, గృహ హింస, భద్రతా సమస్యలను ఎదుర్కొంటున్నారని, మహిళా చైతన్యం, చట్టాల అమలు, సామాజిక మార్పు ద్వారా వారికి పూర్తి రక్షణ, సమాన అవకాశాలు కల్పించడం, మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. బాల్య వివాహాలు, గృహ హింస, టీనేజీ గర్భధారణ వంటి సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయని, వీటన్నిటికీ పరిష్కారం విద్య ఒక్కటేనని పేర్కొన్నారు. పిల్లలు, మహిళల కోసం చైతన్యం అనే ఒక వినూత్న కార్యక్రమం మహిళా దినోత్సవం రోజున ప్రారంభిస్తున్నామని చెబుతూ వైద్య, విద్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు.
         అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇరువురు ఇతర అధికారులతో కలిసి బాల బాలికల సంరక్షణ, చట్టాలపై సమగ్ర అవగాహన కార్యక్రమానికి సంబంధించిన చైతన్యం గోడపత్రిక ఆవిష్కరించారు. అదేవిధంగా వ్యాపారవేత్తలకు ఉపయోగపడే విధంగా కాంటాక్ట్ వివరాలతో కూడిన క్యాటలాగ్ పోస్టర్ను ఆవిష్కరించారు.
        తదుపరి జిల్లా కలెక్టర్, ఎస్పీ వివిధ ప్రభుత్వ శాఖలు, మహిళా వ్యాపారవేత్తలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి వారి ఉత్పత్తులు పరిశీలించారు. డ్వాక్రా మహిళలు, వ్యాపారవేత్తలతో ముఖాముఖి మాట్లాడి ఉత్పత్తుల వివరాలు, మార్కెటింగ్ సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ క్యారెట్, చిలకడదుంప, కాకరకాయ వంటి ఆర్గానిక్ ఉత్పత్తుల పౌడర్ లను స్వయంగా కొనుగోలు చేశారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ – సెర్ప్, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, స్త్రీ శిశు సంక్షేమం, పోలీసు, వైద్య ఆరోగ్య, వ్యవసాయ, ఉద్యాన, పరిశ్రమలు, విభిన్న ప్రతిభావంతులు హిజ్రాలు వయోవృద్ధుల సంక్షేమం, సాంఘిక, గిరిజన, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలు, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు, సమగ్ర శిక్ష, బ్యాంకులు–ఋణాలు వంటి స్టాల్స్ ను ఏర్పాటు చేసి ప్రభుత్వం అందిస్తున వివిధ రకాల సేవలు, సంక్షేమ పథకాలను వివరించారు. ఉన్నతి, కార్పొరేషన్ల పథకాల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఆటోలు, ట్రాక్టర్లు, స్టీల్ బడ్డీలు అందించారు.
           కార్యక్రమంలో డీఆర్డీఏ, ఐసిడిఎస్ పీడీలు హరిహరానాథ్, యంఎన్ రాణి, ఉద్యాన, వ్యవసాయ శాఖల అధికారులు జె జ్యోతి, ఎన్ పద్మావతి, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారిణి ఝాన్సీలక్ష్మీ, పశుసంవర్ధక, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖల అధికారులు చిన్న నరసింహులు, కామరాజు, కృష్ణా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య ఉషా, సీఐ రమణమ్మ, మానవహక్కుల ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్టర్ గోవాడ ప్రశాంతి, డ్వాక్రా సంఘాల మహిళలు, మహిళా ప్రభుత్వ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...