Skip to main content

కృష్ణా యూనివర్సిటీలో మహిళా దినోత్సవ వేడుకలు


మచిలీపట్నం, 7 మార్చి 2026, SSN: 
     
         దేశంలో స్వాతంత్ర్యానికి ముందు నుండే ఎందరో మహనీయుల త్యాగాలతో మహిళలకు హక్కులు లభించాయని అదనపు న్యాయమూర్తి బాలా త్రిపురసుందరి దేవి పేర్కొన్నారు. 
      శనివారం కృష్ణా విశ్వవిద్యాలయం మహిళా సాధికారిత విభాగం ఆధ్వర్యములో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జ్యోతిరావు పూలే దంపతులు, డా. బిఆర్ అంబేడ్కర్, రాజరామోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు లాంటి మహనీయుల త్యాగాలతో సాంఘిక దురాచారాలు రూపుమాపడం జరిగిందన్నారు. జర్మనీ దేశంలో తొలిసారి మహిళా దినోత్సవం జరుపుకోవడం ప్రారంభమైందన్నారు.
        గౌరవ అతిధి రెండవ అదనపు న్యాయమూర్తి దేవస్త దీపికా మాట్లాడుతూ ఎటువంటి ఆర్థికభారం లేకుండా, పోలీస్ కేసులు పెట్టకుండా కూడా నిర్భయంగా మహిళలు న్యాయస్థానం ను ఆశ్రయించవచ్చని చెప్పారు. రాజస్థాన్ రాష్ట్రం లో ఓ మహిళ పోరాటం వల్ల పోష్ చట్టం రూపొందిన విషయాన్ని గుర్తించాలన్నారు. సామాజిక మాధ్యమాల వల్ల చోటు చేసుకుంటున్న దుష్పరిణామాలను విశదీకరించారు.
       కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకపతి ఆచార్య కె. రాంజీ మాట్లాడుతూ విద్యార్దినిలు తరగతి పాఠాలు వినేందుకే పరిమితం కాకుండా ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలన్నారు. పేద విద్యార్దిని ల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నా అతికొద్ది మందే వినియోగించుకుంటున్నారు అని చెప్పారు.
        మహిళా సాధికారిత విభాగం సమన్వయకర్త డాక్టర్ ఎల్. సుశీల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రెక్టర్ ఆచార్య ఎంవి. బసవేశ్వరరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. ఉష, వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ అర్చిష్మా, హెల్త్ కేర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ మాకాల సత్యనారాయణ తదితరులు ప్రసంగించారు. అనంతరం మహిళా దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని నిర్వహించిన పలు పోటీలలో విజేతలకు బహుమతులు అందచేశారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...