Skip to main content

మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా పోలీస్ పెరేడ్ మైదానంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం

 విద్యార్థులకు పోలీస్ శాఖ పనితీరుపై అవగాహన

మచిలీపట్నం, 6మార్చి 2026, SSN:

       మహిళా దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం కృష్ణా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ పెరేడ్ మైదానంలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమానికి మచిలీపట్నం పరిధిలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినిలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వారికి పోలీస్ శాఖలో వినియోగిస్తున్న ఆయుధాలు, వాటి పనితీరు గురించి అధికారులు వివరంగా అవగాహన కల్పించారు. అలాగే పోలీస్ శాఖలో ఉన్న వివిధ విభాగాలు, వాటి విధులు, చట్టం, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర వంటి అంశాలపై కూడా విద్యార్థులకు తెలియజేశారు. 
          పోలీసులు శాంతిభద్రతలు కాపాడటానికి, సంఘవిద్రోశక్తులను నిరోధించడానికి వినియోగించే అత్యాదునిక ఆయుధాలు, AK-47, మెషిన్ గన్లు, రివాల్వర్లు పిస్టల్ లు, గ్రేనేడ్లు, టియర్ గ్యాస్ షెల్, వైర్ లెస్ సెట్, డిహెచ్ఎండి, హెచ్ హెచ్ఎండి, బాంబు డిస్పోజల్ సిబ్బంది వినియోగించే పరికరాలు, డాగ్ స్క్వాడ్ వారు వినియోగించే పరికరాలు, పోలీసు జాగిలాల గురించి వివరించారు.
         ఎస్పీనే స్వయంగా వివిధ రకాల ఆయుధాల పనితీరు ఏ విధంగా ఉండేది, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి మొదలైన విషయాలను విద్యార్థులకు వివరించారు. కొన్ని ఆయుధాలను ఎస్పీ స్వయంగా టార్గెట్ పై ఉపయోగించి అవి ఎలా పని చేస్తాయి, వాటితో జనసమూహం అధికంగా గుమిగూడినప్పుడు ఏ విధంగా చెదరగొట్టవచ్చు అనే విషయాలు విద్యార్థులకు తెలిసేలా ప్రదర్శించారు. విద్యార్థులు ఆద్యంతం ఆసక్తితో మరిన్ని ప్రశ్నలు అడిగి వాటి గురించి అదనపు సమాచారం తెలుసుకున్నారు.విద్యార్ధిని లు వాటి పని తీరు తెలుసుకొని, ఆనందం వ్యక్తం చేసారు. 
        పోలీస్ జాగిలాలు యొక్క ప్రదర్శన ఆద్యంతం విద్యార్థులను ఆకట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఏ ఆర్ సత్యనారాయణ , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వై సత్య కిషోర్ , ఇన్స్పెక్టర్లు అబ్దుల్ నబీ , వాసా వెంకటేశ్వరరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ రాఘవయ్య , ఎస్సైలు , ఆర్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...