Skip to main content

బ్రాహ్మణులు అందరినీ కలుపుకుంటూ హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాలి.


మచిలీపట్నం, 6 మార్చి 2026, SSN:

      సంకష్ట హర చతుర్థి సందర్భముగా సర్వేజనా సుఖినోభవంతు అంటూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ ఘనాపాటి ఆధ్వర్యంలో బ్రాహ్మణ సేవా సంఘం వారు బుట్టాయిపేట శ్రీ చిట్టి పిళ్ళా రయ్య స్వామి వారి దేవాలయములో లోక సంక్షేమం కొరకు శుక్రవారం స్వామివారికి అభిషేకములు, అర్చనలు, శ్రీ లక్ష్మీ గణపతి హోమంలను బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ పి. వి. ఫణి కుమార్ దంపతులు శాస్త్రోత్తంగా నిర్వహించారు. అనంతరం బ్రాహ్మణ సేవా సంఘం వారి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. 
         ఈ సమావేశానికి హాజరైన ప్రముఖ వైద్యులు, బ్రాహ్మణ సేవా సంఘం సీనియర్ నాయకుడు, డాక్టర్ బృందావనం ధన్వంతరి ఆచార్య మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణలో బ్రాహ్మణులు అందరినీ కలుపుకుంటూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలి అని కోరారు.బ్రాహ్మణులు సమాజ సేవలో ముందు ఉంటూ, సమాజాభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేయడం మన బాధ్యత అన్నారు.           బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ మాట్లాడుతూ బ్రాహ్మణ పిల్లలకు సంధ్యావందనం ఉచితంగా నేర్పించడం జరుగుతుందని, భవిష్యత్తు తరాలకు మన సంస్కృతి, సాంప్రదాయాలను తెలియజేసే బాధ్యత తల్లిదండ్రులపై ఎంతో ఉంది అన్నారు. హిందూ ధర్మం ఎంతో గొప్పదని అటువంటి ధర్మ పరిరక్షణలో మనం మనతోపాటు ఉన్నవారందరినీ కలుపుకుంటూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేయాలి అన్నారు. దేవాలయాలు మన సంస్కృతికి చిహ్నాలని, అటువంటి దేవాలయాలలో మంచి మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అన్నారు. 
        బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ పి. వి. ఫణి కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి దేవాలయంలోనూ అర్చకుడితో పాటు, ఒక బ్రాహ్మణుడిని దేవాలయ కమిటీలలో నియమించడం జరిగిందని, ఆ కమిటీలలో ఉన్న బ్రాహ్మణులు దేవాలయాల అభివృద్ధికి చక్కటి సూచనలు, సలహాలు ఇస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు దేవాలయాల్లో వెల్లివిరిసేలా విశేష కృషి చేయాలి అని కోరారు. బ్రాహ్మణులకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే పెద్దల దృష్టికి ఆ సమస్యను తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ఫణి కుమార్ పలువురు బ్రాహ్మణులకు హామీ ఇచ్చారు. 
        ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు, మోపర్తిసుబ్రమణ్యం, కానుకొలను ఫణి కిరణ్ శర్మ, సింగరాజు గోవర్ధన్, వడ్లమన్నాటి మారుతి దివాకర్, జమ్మలమడక సేతురామయ్య, జొన్నలగడ్డ కాంత్, దిట్టకవి వెంకటేశ్వరరావు ధూళిపాళ్ల శ్రీరామచంద్రమూర్తి, నిమ్మగడ్డ శ్రీధర్, సర్వా లలిత కుమారి, జొన్నలగడ్డ మాధవి తదితరులతో పాటు జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...