ఘంటసాల:
కృష్ణా జిల్లా ఎస్‌పి వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘంటసాల పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా సాధికారతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళలను చైతన్యపరిచి వారిలో మనోధైర్యాన్ని పెంపొందించే మహిళా సాధికారత వీడియోలను స్కూల్స్, కాలేజీలు మరియు హాస్టళ్లలో ప్రదర్శించారు. మహిళల హక్కులు, భద్రత, చట్ట పరిరక్షణ, సైబర్ నేరాలపై జాగ్రత్తలు మరియు అత్యవసర సమయంలో సంప్రదించాల్సిన హెల్ప్‌లైన్ నంబర్లపై వివరించారు.
మహిళలు ధైర్యంగా ముందుకు సాగి తమ హక్కులను తెలుసుకుని స్వయం రక్షణపై అవగాహన కలిగి ఉండాలని ఘంటసాల ఎస్సై చందన సూచించారు.
Comments
Post a Comment