Skip to main content

బాలల సంక్షేమ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు –– జిల్లా కలెక్టర్

మచిలీపట్నం: 

బాలల సంక్షేమం, సంరక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని, జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు బాలల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు.

సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి బాలల సంక్షేమ పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు, కమిటీ సభ్యులతో కలిసి ఆయన బాలల సంరక్షణ, బాల్యవివాహాలు, పిల్లల లైంగిక వేధింపులు, బాలల సమస్యలపై చర్చించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాలల సంక్షేమం, సంరక్షణ కోసం ప్రభుత్వం పోక్సో, జువెనైల్ జస్టిస్ యాక్ట్ వంటి కఠిన చట్టాలను అమలు చేస్తోందన్నారు. జిల్లా స్థాయిలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్లు, బాలల సంక్షేమ కమిటీలు (సీడబ్ల్యూసీ), జువెనైల్ జస్టిస్ బోర్డులు (జేజేబీ) ఏర్పాటు చేసి బాలల సంక్షేమాన్ని పర్యవేక్షిస్తుందన్నారు. దీనిపై జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు, అదేవిధంగా పాఠశాలలు, కళాశాలల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. బాల్యవివాహాల నిషేధంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వాటి వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం అందగానే సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వారి పరిధిలో జరిగే బాల్య వివాహాలపై నిత్యం అప్రమత్తంగా ఉండే విధంగా గ్రామ వార్డు సచివాలయ మహిళా పోలీస్, అంగన్వాడి కార్యకర్తలు, సిబ్బందిని అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు.

ఆధార్ కార్డులు లేని జిల్లాలోని 23 మంది అనాధ పిల్లలకు తక్షణమే మంజూరు చేసే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని, అందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాల కోసం సంబంధిత తహసిల్దార్లను సంప్రదించాలని సిడిపిఓ లకు సూచించారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న పిల్లల సంరక్షణ కేంద్రాల వద్ద నిత్యం పెట్రోలింగ్ నిర్వహించాలని, పరిసర ప్రాంతాలలో మందుబాబుల ఆగడాలు, ఇతర సమస్యలు తలెత్తినా వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. పిల్లలపై లైంగిక వేధింపులు, బాల్యవివాహాల సమాచారంపై తక్షణం స్పందించి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.
సమావేశంలో ఐసిడిఎస్ పిడి ఎంఎన్ రాణి, డి ఎస్ డి ఓ ఝాన్సీ లక్ష్మి, విద్యాశాఖ ఏడి ఎం విద్యాలత, జెడ్పి సీఈవో డాక్టర్ ఆనంద్ కుమార్, జి ఎస్ డబ్ల్యూ ఎస్ అధికారి రవికాంత్, ప్రొటెక్షన్ ఆఫీసర్లు ప్రశాంతి, మధుబాబు, డీసీపీఓ కిషోర్, సీఐ వెంకటేశ్వరరావు, సిడిపిఓలు, డిసిపియు, చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది, వాసవ్య మహిళా మండలి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఎం దివ్య, సిహెచ్ ఉషారాణి, సిహెచ్ శాంతి తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...