మచిలీపట్నం:
ఆర్ పేట పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు నమోదయింది. నిజాంపేటకు చెందిన 45 సంవత్సరాల ఆలయ పూజారి ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న బాలికను బెదిరించి అత్యాచారం చేసినట్లుగా తెలుస్తోంది. బాలికకు అనారోగ్యంగా ఉండటంతో వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తీసుకువెళ్లిన తల్లిదండ్రులకు బాలిక గర్భం దాల్చినట్లుగా తెలిసింది. తల్లిదండ్రులు బాలికను విచారించగా జరిగిన విషయం చెప్పడంతో ఆలయ పూజారిపై ఆర్ పేట పోలీస్ స్టేషన్ లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన ఆర్ పేట పోలీసులు ఆలయ పూజారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు
Comments
Post a Comment