స్టాల్‌ను సందర్శించి కొనుగోలు చేసిన జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ కుమార్
మచిలీపట్నం:
కలెక్టరేట్ ప్రాంగణంలో సోమవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజి కుమార్తె చిన్నారి ముగిలు ప్రత్యేక చారిటీ జ్యూస్ స్టాల్‌ను ఏర్పాటు చేసి పానీయాలు విక్రయించింది. తన స్నేహితురాలు రుత్వికతో కలిసి ఈ స్టాల్‌ను నిర్వహిస్తూ పుచ్చకాయ జ్యూస్, సుగంధి పానీయాలను విక్రయించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ కుమార్ స్టాల్‌ను సందర్శించి పుచ్చకాయ జ్యూస్, సుగంధి పానీయాలను కొనుగోలు చేశారు. అనంతరం చిన్నారులను అభినందిస్తూ, చిన్న వయస్సులోనే సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చిన్నారుల్లో సామాజిక బాధ్యతా భావాన్ని పెంపొందిస్తాయని అన్నారు.
చిన్నారుల్లో సేవా భావం, దాతృత్వం, సామాజిక బాధ్యత పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం కలెక్టరేట్‌కు వచ్చిన అధికారులు, సిబ్బంది, సందర్శకులను ఆకట్టుకుంది. స్టాల్ వద్ద అందుబాటులో ఉంచిన పానీయాలను కొనుగోలు చేస్తూ పలువురు ఈ చారిటీ కార్యక్రమానికి మద్దతు తెలిపారు. విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ పోతురాజుతో పాటు పలువురు కలెక్టరేట్ ఉద్యోగులు పానీయాలను కొనుగోలు చేశారు.
జ్యూస్ స్టాల్ ద్వారా సమకూరిన ఆదాయాన్ని సేవా కార్యక్రమాల కోసం వినియోగించనున్నట్లు చిన్నారులు తెలిపారు. ఈ కార్యక్రమం కలెక్టరేట్ వాతావరణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Comments
Post a Comment