Skip to main content

జెండా ఊపి దివ్యాంగశక్తి పథకాన్ని ప్రారంభించిన ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు

మచిలీపట్నం: 

రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగశక్తి పథకాన్ని ప్రవేశపెట్టి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించి ఎంతో లబ్ధిని చేకూర్చిందని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు పేర్కొన్నారు.

బుధవారం ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మచిలీపట్నం ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ లో దివ్యాంగశక్తి పథకం – ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దివ్యాంగ ప్రయాణికుల ఆర్టీసీ బస్సుకు జండా ఊపి పథకాన్ని ప్రారంభించారు. దివ్యాంగులతో కలిసి బస్సులో చిన్నాపురం వరకు ప్రయాణించారు. అనంతరం ఆయన మచిలీపట్నంలోని రహదారులు భవనాల అతిథి గృహానికి చేరుకొని దివ్యాంగులతో కలిసి భోజనం చేశారు.
ఈ సందర్భంగా బస్టాండ్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన సభలో చైర్మన్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏర్పాటైన ప్రభుత్వాలలో స్త్రీలు, దివ్యాంగులను గొప్పగా పట్టించుకున్న ప్రభుత్వం కేవలం కూటమి ప్రభుత్వం మాత్రమే అని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం స్త్రీలు, దివ్యాంగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఎంతో లబ్ది చేకూర్చిందన్నారు. స్త్రీలకు స్త్రీ శక్తి పథకంతో ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ద్వారా వారిలో చైతన్యం వచ్చిందని, వారు ఉద్యోగాలు, చదువులు, దైవ దర్శనాలు, బంధువులను కలవడం చేస్తున్నారని, ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్త్రీలకు ఎంతో ఆర్థిక ప్రయోజనాన్ని చేకూర్చిందని గుర్తు చేశారు. గతంలో 33 శాతంగా ఉన్న స్త్రీల ప్రయాణం, స్త్రీ శక్తి పథకంతో 67 శాతానికి చేరుతుందని, మొత్తంగా 52 కోట్ల మంది పథకాన్ని వినియోగించుకున్నట్లు తెలిపారు. పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 1,826 కోట్లకు పైగా ఖర్చును భరించినట్లు చెప్పారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం భారంగా భావించకుండా స్త్రీ సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని అన్నారు. ఇదే క్రమంలో మరో అడుగు ముందుకేసి దివ్యాంగుల సంక్షేమం కోసం ఉచిత బస్ ప్రయాణాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం కలిగిన దివ్యాంగులు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులలో ప్రయాణించవచ్చని, నాన్ స్టాప్, సప్తగిరి ఎక్స్ప్రెస్, అంతర్ రాష్ట్ర సర్వీసుల్లో 50 శాతం రాయితీతో ప్రయాణించవచ్చని వివరించారు. దృష్టిలోపం నూరు శాతం, మేధో వైకల్యం 40 శాతం ఉన్నవారికి వారి సహాయకులకు సైతం 50 శాతం రాయితీ వర్తించనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ తెలిపారు. దివ్యాంగులకు గతంలో రద్దయిన 4 శాతం రిజర్వేషన్లు తిరిగి ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణా అధికారి వెంకటేశ్వర్లు, మచిలీపట్నం డిపో మేనేజర్ పెద్దిరాజు, ప్రత్యేక అధికారి నిత్యానంద్, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి కామరాజు, మచిలీపట్నం మార్కెట్ యార్డు చైర్మన్ కుంచె దుర్గా ప్రసాద్ (నాని), పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు కొనకళ్ళ జగన్నాథరావు ( బుల్లయ్య), పీవీ గజేంద్రరావు, లోగిశెట్టి స్వామి, గడ్డం రాజు, లంకే శేషగిరి, సోడిశెట్టి బాలాజీ తదితర కూటమి నాయకులు, దివ్యాంగులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం వద్ద 3,900 మంది భక్తులు  కోటి దీపాలను వెలిగించగా, ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకత. రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు సమీపంలోని రంగనాయక స్వామి దేవాలయంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్  రికార్డుగా నమోదు చేసింది. ఈ రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజ, కార్యనిర్వాహణ అధికారి సమ్మెట ఆంజనేయ స్వామి లకు కి మంగళవారం జరిగిన సభలో అందజేశారు. డా. చింతపట్ల వేంకటా చారి మాట్లాడుతూ 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా ప...

మచిలీపట్నం లో కోల్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో అంబేద్కర్ భవన నిర్మాణము

శ్యామ్ కాగిత, మచిలీపట్నం:     డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణమునకు కోల్ ఇండియా లిమిటెడ్ వారు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి కార్యాలయం తెలియచేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా కోల్ ఇండియా లిమిటెడ్ వారి నుండి 4 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి  ఉత్తర్వులు వెలువడినట్లు తెలియచేసింది.  సదరు భవనంలో ఒక స్టడీ సర్కిల్ , సెమినార్ లు నిర్వహించడానికి అవసరమైన హాలు, స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు, విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన గదుల నిర్మాణం, జరగనున్నది.  స్థానిక నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులతో చర్చించి త్వరలోనే పనులకు శంకుస్థాపన గావించి భవన నిర్మాణ పనులను మొదలు పెడతామని ఎంపి బాలశౌరి ఢిల్లీ నుండి తెలియపరిచారు.

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !!

నోబుల్ కళాశాలకు 182 ఏళ్ల ఘన చరిత్ర !! అంతటి ఘన చరిత్ర గల కళాశాలను ప్రవేట్ సంస్థకు అప్పచెప్పెందుకు నేడు ముమ్ముర యత్నాలు..కుట్రలు ఉన్నత స్థాయిలో పావులు కదుపుతున్న కొందరు ప్రముఖ వ్యక్తులు       ఇంగ్లాండ్ దేశం మధ్య ప్రాంతంలో ' ప్రెస్బ ' అనే గ్రామంలో ఒక చర్చిలో బోధకునిగా ఉన్న జాన్ నోబుల్ పుత్రుడు నోబుల్ కళాశాల స్థాపకులు రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఫిబ్రవరి 9 వ తేదీ 1810 లో జన్మించారు. ప్రాధమిక విద్య ముగిసిన తర్వాత సిడ్ని సస్సెక్స్ కళాశాలలో పట్టభద్రునిగా చదువు పూర్తి చేశారు.           1836 లో కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గోల్డింగ్ హమ్ తమ ప్రాంతంలో నిరక్ష్యరాస్యత, మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయని విద్యావ్యాప్తికి ఎవరినైనా విద్యాధికుడిని భారతదేశానికి పంపాల్సిందిగా ఇంగ్లాండ్ లో ఉన్న తన మిత్రుడు బ్రైటన్ కు తెలిపారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన వారిలో రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఒకరు కాగా రెండవ వ్యక్తి బి.డబ్ల్యూ ఫాక్స్.           నాటి కలెక్టర్ గోల్డింగ్ హమ్ మరో సూచన ఏమిటంటే ...ఆ వచ్చే వ్యక్తికి క్రైస్తవ మిషన...